వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనోడే ప్రధాని.. మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్: థర్డ్ ఫ్రంట్-కొత్త కోణాలు! ఢిల్లీలో చక్రం ఖాయం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Third Front : Support pours in for KCR but here the Other Side

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. సాధ్యాసాధ్యాలపై చర్చలు కూడా సాగుతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ హఠాత్తుగా థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడటం వెనుక కారణాలు ఏమిటనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి.

మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణంతో పాటు ఎన్నో అంశాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని, పార్టీ ఎంపీలను గెలిపించుకోవడం మొదలు.. ఢిల్లీలో చక్రం తిప్పాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ సోమవారం మరో అడుగు ముందుకేశారు. జాతీయస్థాయిలో పలువురితో భేటీ కావాలని నిర్ణయించారు.

హోదాపై కేసీఆర్ నీతిసుత్రాలా.. దీని మాటేమిటి, నవ్వుతున్నారు: దిమ్మతిరిగేలా బీజేపీహోదాపై కేసీఆర్ నీతిసుత్రాలా.. దీని మాటేమిటి, నవ్వుతున్నారు: దిమ్మతిరిగేలా బీజేపీ

మోడీకి మెజార్టీ రాదు.. ఢిల్లీలో చక్రం

మోడీకి మెజార్టీ రాదు.. ఢిల్లీలో చక్రం

కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే ఆయనకు ప్రధాని కావాలనే కోరిక ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మాట ఏమిటో గానీ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చాలినన్ని సీట్లు రావని, తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ లోకసభ స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయేలో చేరి ఢిల్లీలో చక్రం తిప్పవచ్చుననే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారా అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు పలు ఫ్రంట్‌లు వచ్చి విఫలమయ్యాయి. ఈ విషయం కేసీఆర్‌కు తెలుసునని, ఆయన ప్రధాన ఉద్దేశ్యం 2019 తర్వాత ఎన్డీయేలో చేరి చక్రం తిప్పడమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

మరో కాంగ్రెస్‌తో పాటు బీజేపీపై ఘాటైన విమర్శలు ఎందుకు

మరో కాంగ్రెస్‌తో పాటు బీజేపీపై ఘాటైన విమర్శలు ఎందుకు

కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పుంజుకుంటోంది. మరోవైపు, ఏపీ బీజేపీ నేతలు కూడా కేసీఆర్ టార్గెట్‌గా 2019లో కీలకంగా ఎదిగేందుకు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలు కేసీఆర్-మోడీ బయటకు కనిపించని మిత్రులు అని ప్రచారం చేస్తోంది. యాత్రలతో జిల్లాల్లో దూసుకుపోతోంది.

గెలుపుపై ఆశలు సన్నగిల్లాయా

గెలుపుపై ఆశలు సన్నగిల్లాయా

మరోవైపు, పాలనలో కేసీఆర్ విఫలమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్యాయం మొదలు, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, అక్రమాలు అంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి. తెలంగాణ తీసుకు వచ్చిన ఉద్యమ నాయకుడిగానే 2014లో అత్తెసరు సీట్లతో ప్రజలు గెలిపించారు. ఇప్పుడు పాలనలో విఫలమయ్యారని విపక్షాలు చెబుతున్న నేపథ్యంలో గెలుపుపై ఆశలు సన్నగిల్లాయని చెబుతున్నారు.

 మనవాడు ప్రధాని అయితే

మనవాడు ప్రధాని అయితే

ఇంకోవైపు ఎంపీ సీట్లు ఎక్కువ గెలుచుకోవాలనే వ్యూహం. మనవాడు ప్రధానమంత్రి అవుతాడేమో.. అనే ఆలోచన వస్తే ఎవరైనా మద్దతిస్తారు. అలాగే ఎన్నికల్లో ఓట్లు కూడా పడతాయి. ఓ విధంగా ఇది నిన్నటి తెలంగాణ సెంటిమెంట్ వంటిదే అంటున్నారు. ఈ వ్యూహం కూడా కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఉండి ఉంటుందని అంటున్నారు. 2019లో తెలంగాణలో ఓటమిని తప్పించుకునేందుకే ఆయన థర్డ్ ఫ్రంట్ మార్గం ఎంచుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పాలనలోను కేసీఆర్ ఫెయిల్ అయ్యారని, ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు, కాంగ్రెస్, బీజేపీని కార్నర్ చేసేందుకు థర్డ్ వ్యూహం ఎంచుకున్నారని అంటున్నారు.

ఎన్డీయే లేదా థర్ట్ ఫ్రంట్.. కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం

ఎన్డీయే లేదా థర్ట్ ఫ్రంట్.. కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం

ఉద్యమ పార్టీ కాబట్టి 2014లో కేసీఆర్‌ను గెలిపించారని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్నాయి. తద్వారా అలా కలిసి వచ్చి ఆయన సీఎం అయ్యారని అంటుంటారు. ఇప్పుడు తన వ్యూహంతో 2019లో తెలంగాణలో గెలుపుతో పాటు 2014లో వలె కలిసి వస్తే ఏ 'స్థాయిలో'నైనా ఎన్డీయేలో లేదా థర్డ్ ఫ్రంట్‌లో చక్రం తిప్పే అవకాశం వస్తుందని తెరాస భావిస్తోందని అంటున్నారు. అందుకే వ్యూహాత్మకంగా తెరపైకి థర్డ్ ఫ్రంట్‌ను తీసుకొచ్చారని అంటున్నారు.

ప్రజలను ఎలా మచ్చిక చేసుకోవాలో కేసీఆర్‌కు తెలుసా

ప్రజలను ఎలా మచ్చిక చేసుకోవాలో కేసీఆర్‌కు తెలుసా

జనాలను ఎలా మచ్చిక చేసుకోవాలో కేసీఆర్‌కు బాగా తెలుసునని అంటున్నారు. అలాగే ఇతరులను కార్నర్ చేయడం కూడా తెలుసని అంటున్నారు. అందుకు తెలంగాణ ఉద్యమం మొదలు నిన్న ప్రత్యేక హోదాపై ఆయన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అంటున్నారు.

ఇతరులను కార్నర్ చేస్తూ, ప్రతీది అంది పుచ్చుకుంటున్నారు

ఇతరులను కార్నర్ చేస్తూ, ప్రతీది అంది పుచ్చుకుంటున్నారు

నాడు చంద్రబాబు హయాంలో మంత్రి పదవి ఆశించి ఆది రాకపోవడంతో అప్పుడే మళ్లీ మొగ్గ తొడుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అంది పుచ్చుకున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ కేసీఆర్ ఒక్కరే ఎక్కువ క్రెడిట్ కొట్టేశారని అంటున్నారు. అందుకు కోదండరాం ఉదాహరణ అంటున్నారు. తాజాగా, బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మరో ఫ్రంట్ అంటూ లెఫ్ట్ పార్టీలు, చంద్రబాబు పలుమార్లు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా కేసీఆర్ దానిని అంది పుచ్చుకున్నారని చెబుతున్నారు.

ఆసక్తికర వ్యాఖ్యలు

ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలపై కాంగ్రెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటి పోరు పడలేకనే కేసీఆర్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవితల మధ్య టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు ఉందని విపక్షాలు నిత్యం విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.

English summary
Unfazed by an elusive Third Front, Telangana chief minister K Chandrasekhar Rao pitched for an alternative for the Congress and the BJP while advocating a Constitutional change to empower states more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X