నగరానికి వంద కిలోమీటర్లు పరిధిలో (పిక్చర్స్)
హైదరాబాద్: వజ్రాల తెలంగాణ సాధించుకునే సంపద ఇక్కడి భూమాత వద్ద ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణలో రూ. 5 లక్ష కోట్ల విలువైన భూములు వివాదాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
అవి గనుక త్వరగా పూర్తైతే బంగారు తెలంగాణయే కాదు.. వజ్రాల తెలంగాణను సాధించుకుంటామన్నారు. శనివారం హైదరాబాద్ పురానీహవేలీలోని సిటీ సివిల్ కోర్టు 150 సంవత్సరాల ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.
ఈ సందర్బంలో సీఎం కె చంద్రశేఖరరావు కోర్టు కేసుల్లో నలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ భూముల విలువ రూ.5 లక్షల కోట్లకు పైమాటే అని అన్నారు. ఆ కేసుల్లో ప్రభుత్వం విజయం సాధిస్తే ‘బంగారు తెలంగాణ కాదు.. వజ్రాల తెలంగాణ సాధించగలుగుతామ'ని ఆయన అన్నారు. కబ్జాలు, నకిలీపవూతాలు, అన్యాక్షికాంతాలతో ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన అక్రమార్కులు కోర్టుల్లో కేసులు నడుపుతున్నారని అన్నారు.
ఎలాంటి వివాదాలు లేని 30 లక్షల ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్దలాలు నగరానికి వంద కిలోమీటర్లు పరిధిలో ఉన్నాయని చెప్పారు. వీటిలో మూడు లక్షల ఎకరాలను ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు కేటాయించాలని తాను సింగపూర్ వెళ్లడానికి ముందు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి దక్కేందుకు సహకరించాలని తెలంగాణ న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర శ్లాఘనీయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ పోరాటంలో న్యాయవాదుల త్యాగాలను విస్మరించలేమన్నారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
శనివారం హైదరాబాద్ పురానీహవేలీలోని సిటీ సివిల్ కోర్టు 150 సంవత్సరాల ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.

శనివారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు 150 వసంతోత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు, చిత్రంలో జస్టిస్ చంద్రయ్య, డిప్యూటీ పద్మాదేవేందర్ తదితరులు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
శనివారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు 150 వసంతోత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జస్టిస్ చంద్రయ్య, డిప్యూటీ పద్మాదేవేందర్ తదితరులు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
ప్రపంచంలో న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చిన రాజు నిజాం రాజేనని కేసీఆర్ అన్నారు. నిరంకుశత్వానికి చిహ్నమైన రాజరికానికి వారసుడై ఉండి కూడా న్యాయ విభాగానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారని, తానుకూడా న్యాయస్థానాలకు బద్ధుడినేని ప్రకటించారని చెప్పారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
చరివూతను చాలా వక్రీకరించారని, ప్రస్తుతం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకొంటున్న సిటీ సివిల్ కోర్టు ఆయన కాలంలోనే ఏర్పాటైందన్నారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
163లో సిటీ సివిల్ కోర్టు, 175లో హైకోర్టును ఏర్పాటు చేశారని వివరించారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణాన్ని 1900వ సంవత్సరంలో ప్రారంభించి 1919లో పూర్తిచేశారన్నారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
ఈ విషయాలను పక్కదారి పట్టించి కొంతమంది పొద్దున లేచినకాడినుంచి హైదరాబాద్‌ను మేమే నిర్మించామని గొప్పలు చెప్తుంటారని ఎద్దేవా చేశారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
చరివూతను తాను వివరిస్తుంటే కొంతమందికి బాధ కలుగుతుందని కేసీఆర్ అన్నారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
నిజాం కాలంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉండేదనడానికి నిదర్శనం తమ కుటుంబ స్వానుభవమేనని ఆయన చెప్పారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
కరీంనగర్‌లోని తన పూర్వీకుల స్థలాన్ని అప్పర్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ కాలంలో రూ. లక్షా నలభై వేల రూపాయల పరిహారం ఇచ్చిందన్నారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
అయితే నష్టపరిహారం విషయంలో తన తండ్రి అప్పటి హైకోర్టులో న్యాయవాది మహ్మద్ బారీ ద్వారా పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.

వజ్రాల తెలంగాణ సాధించే సంపద మనది: కేసీఆర్
విచారణ చేపట్టిన హైకోర్టు మరో రూ 70 వేలను అదనంగా ఇవ్వాలని తీర్పును ఇవ్వడంతో నిజాం ప్రభుత్వం శిరసావహించి తక్షణమే నిధులను విడుదల చేసిందని తెలిపారు.