• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ కుట్రలోఈటెల బలిపశువు..అప్పుడు రాజయ్య, ఇప్పుడు రాజేందర్, తెలంగాణలో బిగ్ డిబేట్!!

|

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఆరోగ్యశాఖ మంత్రిగా తొలగిస్తూ, ఆరోగ్య శాఖలో తన పరిధిలోకి తెచ్చుకుంటూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయానికి వెంటనే గవర్నర్ ఆమోదం లభించడం చకచకా జరిగిపోయాయి. తాజా పరిణామాలు గతంలో కేసీఆర్ నిర్ణయాలపై తెలంగాణా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.

అప్పుడు తాటికొండ రాజయ్య బర్తరఫ్ .. ఇప్పుడు టార్గెట్ ఈటెల

అప్పుడు తాటికొండ రాజయ్య బర్తరఫ్ .. ఇప్పుడు టార్గెట్ ఈటెల

గతంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన తాటికొండ రాజయ్య ను బర్తరఫ్ చేసి తీవ్ర అవమానానికి గురి చేసిన సంఘటనను తెలంగాణ రాష్ట్రం మర్చిపోలేదు.ఇక తాజాగా భూ కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ పై వేటు వేయడానికి తెలంగాణ సర్కార్ రెడీ అవ్వడం ,ఈటెల రాజేందర్ ను ఘోరంగా అవమానించి బయటకు నెట్టటానికి ప్రయత్నించడం తెలంగాణ రాష్ట్రంలో చర్చకు కారణమవుతుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి ఈటెల రాజేందర్ ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా,మహమ్మారిని కట్టడి చేయలేకపోతున్నారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేస్తున్న సమయంలో,ప్రతిపక్షాలు తెలంగాణ సర్కార్ పై విరుచుకు పడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఊహించని విధంగా ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారు.

భూ కబ్జాల ఆరోపణలు .. పక్కా ప్లాన్ గా కేసీఆర్

భూ కబ్జాల ఆరోపణలు .. పక్కా ప్లాన్ గా కేసీఆర్

ఎవరినైనా పదవినుంచి తొలగించాలని అనుకుంటే, వారిపై అవినీతి ఆరోపణలు వేసి, అన్ని విధాలుగా వారిని వీక్ చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ వారిని పక్కన పెడతారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎప్పటి నుండో చర్చ ఉంది. ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ పై వేటు వేయడానికి ఊహించని విధంగా భూకబ్జా ఆరోపణలు తీసుకురావడం, దానిపై వెనువెంటనే విచారణకు ఆదేశించడం, జరిగిన 24 గంటలు లోపే ఆయన శాఖను తన అధీనంలోకి బదిలీ చేసుకోవడం జరిగిపోయాయి .

అప్పుడు రాజయ్య , ఇప్పుడు ఈటెల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకం చేసే పనిలో కేసీఆర్

అప్పుడు రాజయ్య , ఇప్పుడు ఈటెల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకం చేసే పనిలో కేసీఆర్

గతంలో మొట్టమొదటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్య విషయంలో కూడా అవినీతి ఆరోపణలతో దారుణంగా బర్తరఫ్ చేసి,తాటికొండ రాజయ్యను చచ్చిన పాములా తయారు చేశారు.ఇక ప్రస్తుతం ఈటెల రాజేందర్ వ్యవహారంలోనూ భూ కబ్జా ఆరోపణలు రావడంతో, తనకు తానుగా రాజీనామా చేస్తారని భావించిన కెసిఆర్ తనపై విచారణ జరుపుకోవాలని ఈటెల రాజేందర్ సవాల్ చేయడంతో, విచారణకు ఆదేశించారు. అసైన్డ్ భూములను కబ్జా చేశారని నివేదికలో తేలడంతో వెనువెంటనే చర్యలకు ఉపక్రమించారు.అందులో భాగంగా ఆయన అధీనంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖను తన పరిధిలోకి బదిలీ చేసుకున్నారు.

ఊహించని పరిణామంతో డైలమాలో ఈటెల రాజేందర్

ఊహించని పరిణామంతో డైలమాలో ఈటెల రాజేందర్

ఊహించని ఈ పరిణామానికి ఈటెల రాజేందర్ డైలమాలో పడ్డారు. ఒక్కసారిగా ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా కావడంతో తీవ్ర సందిగ్ధంలో ఉన్న ఈటెల రాజేందర్ ఏం చేస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.ప్రతిపక్ష పార్టీలు కావాలని కేటీఆర్ కోసం ఈటెల రాజేందర్ ను బలి చేస్తున్నారని, ఈటెల రాజేందర్ దూకుడు తట్టుకోలేకనే, ప్రశ్నించే వారు ఉండకూడదు అన్న భావనతో కెసిఆర్ కావాలని కుట్ర చేసి ఈటెల ను బయటకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈటెలను బలిపశువును చేస్తున్నారన్న కాంగ్రెస్ నాయకులు

ఈటెలను బలిపశువును చేస్తున్నారన్న కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు మంత్రి ఈటెల రాజేందర్ ను బలిపశువును చేస్తున్నారని మండిపడుతున్నారు. భూ కబ్జా ఆరోపణలపై విచారణ జరగాల్సింది ఈటెల రాజేందర్ పై కాదని కేసీఆర్ కుటుంబంపై అని వారు విమర్శిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ అందరూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

అవినీతి ఆరోపణలున్న మంత్రులను అందరినీ తొలగించాలని బండి సంజయ్ ఆగ్రహం

అవినీతి ఆరోపణలున్న మంత్రులను అందరినీ తొలగించాలని బండి సంజయ్ ఆగ్రహం

మల్లారెడ్డి తోపాటు కేటీఆర్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు విచారణ జరపలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను నిలదీశారు. సీఎం వ్యతిరేక వర్గం పై ఆరోపణలు వస్తే విచారణకు ఆదేశించడం, అనుకూల వర్గాలు దోపిడీ చేసిన వదిలేయడం కేసీఆర్ కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఇది కుట్రపూరితంగా ఈటెల రాజేందర్ ని బలిపశువును చేయడమేనని విమర్శించారు ప్రతిపక్ష పార్టీల నాయకులు .

  Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!
  కేసీఆర్ మార్క్ రాజకీయంపై తెలంగాణలో బిగ్ డిబేట్

  కేసీఆర్ మార్క్ రాజకీయంపై తెలంగాణలో బిగ్ డిబేట్

  ప్రతిపక్షాల విమర్శలను పక్కనపెడితే టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా వ్యవహరిస్తున్న వారిపై అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అంతెందుకు కెసిఆర్ కుటుంబం పైనే , మంత్రి కేటీఆర్ పై కూడా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి.మంత్రులు తప్పు చేస్తే సహించనని షాకింగ్ నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్ ఇప్పుటివరకు ఆరోపణలు వచ్చిన ఎంత మంది మంత్రులపై చర్యలు తీసుకున్నారు అన్నది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. మొత్తానికి తాజా పరిణామాలు సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై , నచ్చని వారిని బలిపశువులుగా మార్చే విధానంపై తెలంగాణ రాష్ట్రంలో బిగ్ డిబేట్ కు కారణమవుతున్నాయి.

  English summary
  Unexpected developments are taking place in the TRS party in Telangana. The decision of CM KCR to remove Medical Health Minister Etela Rajender from the post of Health Minister and bring the health ministry under his purview will be discussed in telangana .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X