హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్‌లోపు ఎన్నికలు జరగాలంటే: కేసీఆర్ ఫోన్లు, రాజ్ భవన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై లైవ్ అప్డేట్ | Live Update | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాసేపట్లో కేబినెట్‌తో భేటీ కానున్నారు. అసెంబ్లీ రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు కేబినెట్ భేటీ అనంతరం ఓ బస్సులో మంత్రులతో కలిసి రాజ్ భవన్ వెళ్తారు. అక్కడ కేబినెట్ తీర్మానాన్ని సమర్పిస్తారు. అనంతరం అదే బస్సులో తెరాస భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడుతారు.

అసెంబ్లీ రద్దు వెనుక మరో కోణం: హైదరాబాద్ టు ఢిల్లీ, కేసీఆర్ 'ట్రిపుల్' ప్లాన్ అసెంబ్లీ రద్దు వెనుక మరో కోణం: హైదరాబాద్ టు ఢిల్లీ, కేసీఆర్ 'ట్రిపుల్' ప్లాన్

సాయంత్రం ఆరు గంటలకు గజ్వెల్ వెళ్తారు. రేపు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. మరోవైపు ముందస్తు ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. ఢిల్లీలో వార్ రూమ్ సమావేశానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ముందస్తు వ్యూహంపై హైకమాండ్ పెద్దలతో చర్చించారు.

KCR convenes Cabinet meeting to dissolve Assembly and seek early elections

మధ్యాహ్నం ఒకటి గంటలకు సమావేశం కానున్నామని, మంత్రులు అందరూ ఆ సమయానికల్లా ప్రగతి భవన్ చేరుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతకుముందు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులకు ఫోన్లు చేసి చెప్పారు. చాలామంది మంత్రులు నిన్న సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు గురువారం ఉదయం వచ్చారు.

మీడియా సమావేశంలో ముందస్తుకు వెళ్లనున్న కారణాలను కేసీఆర్ వివరించనున్నారు. డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాలంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఉందని, అందుకే ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.

రాజ్ భవన్ ఎదుట సూసైడ్ అటెంప్ట్

రాజ్ భవన్ ఎదుట ఈశ్వర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. తెలంగాణకు ఏం చేశాడని ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు, విద్యార్థులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వర్ తన వెంట కిరోసిన్ డబ్బా తెచ్చుకొని, ఆత్మహత్యాయత్నం చేశారు. తన పైన కిరోసిన్ పోసుకున్న అనంతరం అగ్గిపెట్టేతో అంటించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.

{document1}

English summary
Chief Minister K. Chandrasekhar Rao has convened a meeting of his Council of Ministers at noon on Thursday, September 6, 2018, to dissolve the Legislative Assembly and seek fresh elections six months ahead of schedule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X