వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లమ్మ తల్లికి కెసిఆర్ దంపతుల పట్టు వస్త్రాలు, తలంబ్రాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేకర రావు సతీసమేతంగా కళ్యాణోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన సతీమణి శోఓ దంపతులు ఎల్లమ్మ తల్లికి పట్టువస్ర్తాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి మహోత్సవాన్ని వీక్షించి అమ్మ కృప పొందేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 KCR couple in Balkampet Yellamma temple

ఇదిలావుంటే, హైదరాబాదులోని సనత్‌నగర్, కూకట్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఇందిరానగర్‌లో రహదారులు, ఇళ్లను సీఎం పరిశీలించారు. బస్తీలో ప్రజల సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

నగరంలోని బస్తీల్లో దాదాపు 2 లక్షలు కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. వీరందరికీ దశల వారీగా డబుల్ బెడ్‌రూమ్స్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరానగర్ బస్తీవాసులకు జీప్లస్2 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు. లేఅవుట్ నమూనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌పీఎస్ ఎదురుగా ముస్లింలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు.

English summary
Telangana CM K Chnadrasekhar Rao along with his wife Shobha attended Blkampet Renuka Yellamma Kalyana Mahotsavam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X