వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్లలో చేసిందేంటీ : మోదీపై కేసీఆర్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Loksabha Election 2019 : ఐదేళ్లలో చేసిందేంటీ : మోదీపై కేసీఆర్ విమర్శలు | Oneindia Telugu

మిర్యాలగూడ : కాంగ్రెస్, బీజేపీల వల్లే దేశానికి ఈ గతి పట్టిందన్నారు సీఎం కేసీఆర్. దేశం వెనుకబాటుతనానికి ఆ రెండు పార్టీలే కారణమని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అని విమర్శించారాయన. తెలంగాణలో బీజేపీ స్థాయి ఏంటో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శమని చెప్పారు. మిర్యాలగూడలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు కేసీఆర్. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సాగర్ నుంచి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని ప్రతీనబూనారు కేసీఆర్

118 సీట్లలో ఒక్కటే ..

118 సీట్లలో ఒక్కటే ..

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు కేసీఆర్. 103 స్థానాల్లో డిపాజిట్ దక్కలేదని పేర్కొన్నారు. కానీ ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతాయని విమర్శిచారు. సోషల్ మీడియాలో దుర్మార్గమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారాయన. సర్జికల్ దాడుల గురించి బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందని .. యూపీఏ హయాంలో కేంద్రంమంత్రిగా తాను ఉన్నానని .. అప్పుడు 11 సార్లు దాడులు చేశాయని గుర్తుచేశారు. అంతర్గత విషయాన్ని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ఐదేళ్లలో చేసిందేమీలేదు ?

ఐదేళ్లలో చేసిందేమీలేదు ?

ప్రధాని మోదీ మాటాలే తప్ప చేతలు లేవని విమర్శించారు. ఐదేళ్లలో ఆయన చేసిందెంటో చెప్పాలని ప్రశ్నించారు. రైతులు, దళితులు, గిరిజనులు, బీసీలకు ఏం చేశారో తెలుపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పథకాలను కాపీ కొట్టి కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఓట్లకోసమే హిందూత్వను తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు.

ప్రాంతీయ పార్టీలదే హవా ?

ప్రాంతీయ పార్టీలదే హవా ?

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే అధికారం చేపడుతాయని ధీమా వ్యక్తంచేశారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. 70 వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ స్వయంగా బీసీ అయినా .. ఆ సామాజిక వర్గం సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు.

 దిక్సూచిలా తెలంగాణ

దిక్సూచిలా తెలంగాణ

నాలుగున్నరేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశానికి దిక్సూచిలా మారిందని చెప్పారు కేసీఆర్. సంక్షేమ రంగంలో నెంబర్ వన్ గా నిలిచామని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతిలో, 24 గంటల కరెంట్ ఉత్పత్తిలో కూడా మొదటిస్థానమేనని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని గుర్తుచేశారు.

English summary
This is the fate of the Congress, BJP says KCR. Recall that the two parties were responsible for the country's backwardness. The Prime Minister criticized Modi for wanting to lie. The BJP level in Telangana is the result of the Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X