వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా జగన్ .. డిసైడ్ చేసిన కేసీఆర్ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.

మాజీ మంత్రి నారాయణకు షాక్ .. అనుమతులు లేవని నారాయణ స్కూల్ సీజ్ , లక్ష జరిమానామాజీ మంత్రి నారాయణకు షాక్ .. అనుమతులు లేవని నారాయణ స్కూల్ సీజ్ , లక్ష జరిమానా

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయం

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని సూచన ప్రాయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ చొరవ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహబంధం బలపడాలనేకేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణా జీవనాడిగా తెలంగాణాకే తలమానికమైన ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి

తెలంగాణా జీవనాడిగా తెలంగాణాకే తలమానికమైన ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తుంది.. ఇప్పటికే డ్రై రన్, వెట్ రన్ లను సమర్ధవంతగా నిర్వహించి సక్సెస్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ చివరి దశ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగిస్తున్నారు. కొన్ని పంపులను ట్రయల్ రన్ పూర్తి చేశారు . కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చెయ్యాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు కు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేస్తోంది . తెలంగాణ పాలిటి జీవనాడిగా కాళేశ్వరం నిలవనుంది అని పలుమార్లు చెప్పిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను స్వయంగా సమీక్షిస్తున్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కాళేశ్వరం సిద్ధం అవుతుంది.

సమన్వయంతో ముందుకు సాగుతున్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

సమన్వయంతో ముందుకు సాగుతున్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ఇప్పటికే కెసిఆర్ జగన్ ఒకరికొకరు సహకరించుకుంటూ ,చక్కటి సమన్వయంతో తెలుగు రాష్ట్రాలను ముందుకు నడిపిస్తున్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన సహకారం ఎపీకి ఉంటుందని ప్రకటించారు. ఇక హైదరాబాదులోని ఏపీ సెక్రటేరియట్ భవనాలను జగన్ తెలంగాణకు అప్పగించారు .ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా రెండు రాష్ట్రాల అభివృద్ధి జరగాలని భావిస్తున్న నేపధ్యంలోనే స్నేహపూర్వక వాతావరణం నెలకొనటం కోసం కేసీఆర్ జగన్ ను ముఖ్య అతిధిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు.

English summary
The Chief Minister KCR has decided to inaugurate the Kaleshwaram Project on 21st of this month. CM KCR also decided to invite Andhra Pradesh CM Jagan as Chief Guest for the opening of the Kaleshwaram project. Soon KCR will go to Vijayawada himself and invite Jagan.KCR, who attended the swearing-in ceremony as AP CM Jagan , said that the water dispute between the two provinces would be worked out in harmony with the development of the two states. Jagan is expected to be invited as Chief Guest for the initiative of the Kaleshwaram project to take KCR's initiative
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X