వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన సీఎం కేసీఆర్ - హుజూరాబాద్ మెజార్టీ లెక్కను చెప్పేసారు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. 2019 లో జరగాల్సిన సాధారణ ఎన్నికల కంటే ఆరు నెలలకు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్ ఈ సారి సైతం ముందస్తుకు వెళ్తారనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ సైతం పలు సందర్బాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ ఎల్పీ సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీటన్నింటి పైనా క్లారిటీ ఇచ్చారు.

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఇలా

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఇలా

ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభ జరగాలని నిర్దేశించారు. ఆ సభతో మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని సూచించారు. రోజు 20 నియోజక వర్గాల తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికల పైనా తేల్చి చెప్పేసారు. ఈ సారి మనం ముందస్తు ఎన్నుకలకు వెళ్లడం లేదంటూ కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని.. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

హుజూరాబాద్ లో విజయం మనదే అంటూ

హుజూరాబాద్ లో విజయం మనదే అంటూ

ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకుందామని వ్యాఖ్యానించారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్ట పడి పనిచేయండంటూ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. ఇక, ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల పైన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామంటూ పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేసారు. ఈ నెల 27 హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచార సభ జరగనుంది. పార్టీ ప్లీనరీ సభను 14000 నుంచి 6000 మందికి కుదిస్తున్నట్లు వెల్లడించారు.

Recommended Video

CM KCR Denies His Promise About Dalits - V.Hanumantha Rao
బీజీపీ కంటే 13 శాతం ఆధిక్యంలో ఉన్నామంటూ

బీజీపీ కంటే 13 శాతం ఆధిక్యంలో ఉన్నామంటూ

వరంగల్ విజయ గర్జన సభకు ప్రతి ఊరు నుంచి బస్సు రావాలని సీఎం నిర్దేశించారు. గ్రామ స్థాయి కమిటీలు అయి పోయాయని చెప్పారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ 13% బీజేపీ కంటే లీడ్లో ఉన్నామని కేసీఆర్ పార్టీ నేతలతో వెల్లడించారు. వరంగల్ సభ ఇంచార్జీ గా వర్కింగ్ ప్రసెండెంట్ కేటీఆర్ ను నియమించారు. వరంగల్ సభకు 22 వేల బస్సులతో జనం తరలింపు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్లీనరీ కి నియోజక వర్గం నుంచి 50 వేల మంది వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

English summary
CM KCR given clarity on early elections for Assembly in party mp and mla's meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X