అమిత్ షాను సత్కరించిన కేసీఆర్ -జగన్‌పై ఫిర్యాదు -మోదీ టైమ్ -ఇక ఢిల్లీలో కారు చక్రం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కీలక శాఖల కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు జరుపుతున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించడంతోపాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర సహాయం కూడా కేసీఆర్ కోరుతున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోన్న ప్రాజెక్టులపైనా ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన తెలంగాణ సీఎం.. కేంద్ర జలశక్తి మంత్రిని కలవడం ద్వారా హస్తినలో తన మూడురోజుల పర్యటనను ప్రారంభించారు..
ట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు

జగన్‌పై ఫిర్యాదు..
బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిన సీఎం కేసీఆర్.. తొలుత జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇంటికి వెళ్లి గంటకుపైగా మాట్లాడారు. తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై సీఎం చర్చలు జరిపారు. అదే సమయంలో తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఏపీలోని జగన్ సర్కారు తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలను కేసీఆర్ కేంద్రం ముందుంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కేసీఆర్ చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆలకించిన షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆ వెంటనే..
జగన్‌కు మళ్లీ షాక్ -ఓటరు జాబితాపై నిమ్మగడ్డ ఆదేశాలు -ఫిబ్రవరిలోనే పోల్స్ -సీఎస్‌కు మరో లేఖ

అమిత్ షాకు సత్కారం..
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం జలశక్తి మంత్రి షెకావత్ తో, శనివారం పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలుస్తారు. కీలక శాఖల మంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు తప్పవేమోనని భావించినా, అందుకు విరుద్ధంగా కేసీఆర్ ఢిల్లీ అడుగు పెట్టిన తొలి రెండు గంటల్లోనే అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. చాలా రోజుల తర్వాత వన్ టు వన్ భేటీ అయినవేళ కేసీఆర్.. అమిత్ షాకు శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం దాకా అక్కడే..
నెలల గ్యాప్ తర్వాత ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం వరకు అక్కడే ఉంటారు. ఈ మూడు రోజుల్లో వీలును బట్టి ఏదో ఒక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీ అవుతారు. మోదీతో సమావేశానికి కేసీఆర్ గంట సమయం కోరినట్లు తెలుస్తోంది. మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతోనూ కేసీఆర్ భేటీ కానున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవ ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ చేపట్టిన తొలి ఢిల్లీ పర్యటనకు రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే..

ఇక ఢిల్లీలో కారు చక్రం..
బీజేపీ, కాంగ్రెస్ కూటములు దేశాన్ని ఆగం పట్టించాయని, పాలనలో యూపీఏ, ఎన్డీఏలు రెండూ ఫెయిలయ్యాయని ఆరోపించిన కేసీఆర్.. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కూటమిని నిర్మించి తీరుతానని శపథం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్రేటర్ ఎన్నికల సందర్భంలోనూ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను వేగవంతం చేయబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఫెడరల్ ప్రయత్నాల్లో అతి కీలకమైన ఘట్టంగా భావిస్తోన్న ‘‘ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం'' నిర్మాణానికి కూడా కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలకు తప్ప ఇతర జాతీయ పార్టీలకుగానీ, ఏ ప్రాంతీయ పార్టీకిగానీ ఢిల్లీలో కార్యాలయం లేదు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీకి కేంద్రం.. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తూ అక్టోబర్ లో ఉత్తర్వులివ్వడం తెలిసిందే.