హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై ఈసీ నిర్ణయం నేడు: ఎమ్మెల్యేలు మినహా వారు ఆ పదవుల్లోనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో శాసనసభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం (07-09-2018) నిర్ణయం తీసుకునే అవకాశముంది. త్వరలో నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. వాటితో పాటు తెలంగాణలోను నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Recommended Video

కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే

కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామాకొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం

ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం

వివిధ అంశాలపై చర్చించడానికి ఈసీ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో సమావేశం అవుతుంది. ఈ కారణంగా ఈ రోజు తెలంగాణ అంశంపై చర్చ జరిగే అవకాశముంది. అన్నింటిని పరిగణలోకి తీసుకొని నిర్ణయం వెలువరించనుంది.

ఈసీకి సమాచారం

ఈసీకి సమాచారం

అసెంబ్లీ రద్దు ఉత్తర్వులు గవర్నర్‌ కార్యాలయం నుంచే ఫ్యాక్స్‌ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. మంత్రివర్గం చేసిన తీర్మానానికి గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర వేయగానే ఆ ఉత్తర్వులను, అసెంబ్లీలోని 119 స్థానాలు ఖాళీ అయ్యాయని అసెంబ్లీ కార్యదర్శి ఓ లేఖను రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారికి అందించారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విషయంలో ఈసీ ఇచ్చిన షెడ్యూల్‌ను మాత్రం యథావిధిగా అమలు చేయనున్నారు.

తెలంగాణ తొలి అసెంబ్లీ

తెలంగాణ తొలి అసెంబ్లీ

అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇక మాజీలు అయ్యారు. వారికి అధికారికంగా సమాచారం అందింది. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దయినట్లుగా గవర్నర్‌ నుంచి జారీ అయిన నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు పంపించారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలు అని ప్రకటించారు.

 సీఎం, మంత్రులు, స్పీకర్ ఇలా

సీఎం, మంత్రులు, స్పీకర్ ఇలా

అసెంబ్లీ రద్దై ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఆ పదవుల్లో ఆపద్ధర్మంగా కొనసాగుతారు. శాసనసభ రద్దైనా రాజ్యాంగంలో 179వ అధికరణ ప్రకారం సభాపతి కొత్త సభ ఏర్పాటు అయ్యే వరకు అదే పదవిలో కొనసాగుతారు. స్పీకర్ మధుసూదనా చారీ కొత్త సభ ఏర్పాటు అయ్యే వరకు ఆ పదవిలో ఉంటారు.

English summary
As expected, Telangana CM K Chandrasekhar Rao on Thursday recommended the dissolution of the assembly eight months before its term ends, paving the way for early elections in the state which may now be held in November-December, along with four other states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X