మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా జాతకంలో ఒకటి ఉంది, నేను ఏదంటే అది జరుగుతుంది: కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన జాతకంలో ఒకటి ఉందని, నేను ఏది జరగాలని కోరుకుంటే అవన్నీ ఇప్పటికి జరిగాయన్నారు.

ఇప్పుడు నేను దత్తత తీసుకున్న ఎరవరవల్లి గ్రామం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కల కూడా నెరవేరి తీరుతుందని చెప్పారు. ఎర్రవెల్లి గ్రామస్తులంతా అభివద్ధి చెంది వికసించిన ఒక పువ్వులా కనపడాలని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు.

KCR

డబుల్ బెడ్ రూం ఇళఅలు పూర్తయి ఇళ్లలోకి వెళ్లినప్పుడే మనకు పండుగ అన్నారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వడానికి రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చిందని చెప్పారు. ఇంటిటికీ గోదావరి నీళ్లు, 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంచేందుకు ప్రతి ఇంటికి ట్యాంక్ ఉంటుందన్నారు.

ఎర్రవెల్లి స్వయం సంవృద్ధి గ్రామమని,. గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా ప్రజలందరికీ తెలియాలని, రెండేళ్ల తర్వాత పాములవర్తికి గోదావరి జలాలు వస్తాయన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు నేరుగా ఎర్రవెల్లికే వస్తాయన్నారు. పంచాయితీలు పెట్టుకొని ప్రజలు సమయం వృథా చేసుకోవద్దన్నారు.

పంచాయితీలు, కొట్లాటలు లేకుండా గ్రామస్తులే చూసుకోవాలన్నారు. గన్ ఫెన్సింగ్ కంటే సోషల్ ఫెన్సింగే బలమైందని, ఇళ్లలోకి వెళ్లే సమయానికి ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు అందజేస్తామన్నారు. వర్షాలు బాగా పడి చెరువులు నిండితే రెండో పంటకు ఢోకా ఉండదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎర్రవెల్లిలో ట్రాక్టర్లు పంపిణీ చేశారు. గ్రామంలోని యువకులకు 42 ట్రాక్టర్లు పంపిణీ చేశారు.

English summary
Telangana Chief Minister KCR distributes tractors in Erravalli village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X