వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ స్వప్నం సాకారం అయ్యేనా..! అప్పుడే సచివాలయంలోకి పాదం మోపేనా..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావుది ఉడుం పట్టు అంటారు. ఏదైనా అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని సాధించుకునేంత వరకు ఉపేక్షించేది లేదనే తత్వం సీఎం చంద్రశేఖర్ రావుది. ఇక సచివాలయం నిర్మాణం విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు గులాబీ బాస్. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రిగే వ‌ర‌కూ ఎన్ని అవరోదాలనైనా అదిగమిస్తానంటున్నారు చంద్రశేఖర్ రావు. ఏదైనా ప‌ని పెట్టుకున్న త‌ర్వాత అది జ‌ర‌గ‌కుండా ఆయ‌న అస్స‌లు ఊరుకోలేరు. చేతిలో తిరుగులేని అధికారం ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న కోరుకున్న‌ట్లుగా త‌న‌దైన స‌చివాల‌యం.. త‌న మార్క్ ఉండేలా అసెంబ్లీ భ‌వ‌నాల్ని నిర్మించ‌ుకోలేక‌పోయామన్న కోరిక ఆయనను తొలిచివేస్తుంటుంది. అందుకే ఏదేమైనా తెలంగాణ సచివాలయం తాను అనుకున్న రీతిలో నిర్మింయేందకు సన్నాహాలు చేస్తున్నారు గులాబీ బాస్.

 కేసీఆర్ కు కలిసిరాని సచివాలయం..! అందుకే కూల్చివేత..!!

కేసీఆర్ కు కలిసిరాని సచివాలయం..! అందుకే కూల్చివేత..!!

త‌న‌కున్న సెంటిమెంట్ల ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యం.. అసెంబ్లీ అంటే ఇష్ట‌ప‌డ‌ని చంద్రశేఖర్ రావు.. తెలంగాణ మార్క్ ఉండేలా కొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఇందుకోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. స‌చివాల‌యం కోసం చాలానే చోట్ల భూమికోసం ప్ర‌య‌త్నం చేసి.. ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న‌.. చివ‌ర‌కు ఉన్న చోట‌నే పాత భ‌వ‌నాల్ని కూల్చేసి.. సరికొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆయ‌న చాలానే క‌స‌ర‌త్తు చేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న ఖాళీ చేసి.. ఆ భ‌వ‌నాల్ని కూల్చేసి.. కొత్త స‌చివాల‌యాన్ని భారీగా నిర్మించాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు.

 తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు..! అందుకు ఖర్చుకు వెనకాడేది లేదంటున్న టీఆర్ఎస్..!!

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు..! అందుకు ఖర్చుకు వెనకాడేది లేదంటున్న టీఆర్ఎస్..!!

ఇందులో భాగంగా ఏపీకి ఇచ్చిన భ‌వ‌నాల్ని వెన‌క్కి తీసుకున్న ఆయ‌న‌.. తాజాగా కొత్త స‌చివాల‌య నిర్మాణానికి కీల‌క‌మైన శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. స‌చివాల‌యం న‌మూనాల‌ను 2016లోనే ముంబ‌యికి చెందిన ఆర్కిటెక్ట్ సంస్థ చూపించ‌టం.. వాటిల్లో ఒక న‌మూనాకు చంద్రశేఖర్ రావు ఓకే చేయ‌టం తెలిసిందే. అప్ప‌ట్లో ఓకే చేసిన డిజైన్ ను.. తాజాగా నిర్ణ‌యించిన ముహుర్తంలో శంకుస్థాప‌న చేప‌ట్టి.. స‌చివాల‌య నిర్మాణాన్ని వాయువేగంతో పూర్తి చేయాల‌న్న‌ది చంద్రశేఖర్ రావు ల‌క్ష్యంగా చెబుతున్నారు.

 ఇదే నెలలో ముహూర్తం..! ప్రతిపక్షాలు సహకరించేనా..!!

ఇదే నెలలో ముహూర్తం..! ప్రతిపక్షాలు సహకరించేనా..!!

సికింద్రాబాద్ బైస‌న్ పోలోలో స‌చివాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించినా.. కేంద్రం నుంచి అనుమ‌తిరాని నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన స‌చివాల‌య ప్రాంగ‌ణంలోనే కొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 26 లేదంటే 27 తేదీల్లో స‌చివాల‌య నిర్మాణానికి శంకుస్థాప‌న చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఈ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. ముంయికి చెందిన ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్ హ‌ఫీజ్ కాంట్రాక్ట‌ర్ నుఅధికారికం ఆర్కిటెక్ట్ క‌న్సెల్టెంట్ గా నియ‌మిస్తూ త్వ‌ర‌లోనే అధికారిక ఉత్త‌ర్వును విడుద‌ల చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. కొత్త వాటి విష‌యంలో మ‌హా మోజును ప్ర‌ద‌ర్శించే చంద్రశేఖర్ రావు.. త‌న చిరకాల‌ కోరికైన స‌చివాల‌యాన్ని పూర్తి చేయాల‌ని మ‌హా ఉత్సాహంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 అనవసరం అంటున్న కాంగ్రెస్..! అడ్డుకుంటామంటున్న రేవంత్ రెడ్డి..!!

అనవసరం అంటున్న కాంగ్రెస్..! అడ్డుకుంటామంటున్న రేవంత్ రెడ్డి..!!

ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లునే కాల్చేసుకున్నట్లుగా సీఎం చంద్రశేఖర్ రావు పద్దతి ఉందని ఎంపీ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. సచివాలయంలోని భవనాలకు ఫైర్ సేఫ్టీ లేదని ఏ అధికారి చెప్పాడో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఫైర్ సేఫ్టీ లేకపోతే అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతే కాని చక్కటి భవనాలను కూల్చివేయవద్దని స్పష్టం చేశారు. సచివాలయం లో ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ని మల్కాజ్ గిరి ఎంపీ ఎంపీ ఎ రేవంత్ రెడ్డి కలిశారు. ఇప్పుడున్న సచివాలయం భవనాలను కూల్చొద్దంటూ రేవంత్ లేఖ ఇచ్చారు. సచివాలయం భవనాలను కూల్చివేస్తే న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. ఈ నెల 27 న సచివాలయం నిర్మాణం కోసం శంఖుస్థాపన చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడున్న భవనాలను సద్వినియోగం చేసుకుని, చంద్రశేఖర్ రావు సచివాలయానికి ప్రతిరోజు వస్తే అన్ని పరిష్కారం అవుతాయని అన్నారు.

English summary
According to the sentiments of the existing Secretariat, Assembly, which is not a favorite of Chandrasekhar Rao, many times have planned to build new buildings to ensure Telangana mark? The efforts made for this are not all. Trying to find a place for the Secretariat in many places.The troubled one. The old mansion in the place of the dead, dismantled,to build a new building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X