హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మళ్లీ ఆ ట్రెండ్.. దిష్టిబొమ్మల దహనంతో నిరసన.. ఈసారి కేసీఆర్ వంతు..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణలో మళ్లీ ఆ ట్రెండ్.. దిష్టిబొమ్మల దహనంతో నిరసన! (వీడియో)

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ అప్పటి ట్రెండ్ కనిపిస్తోంది. ఉద్యమ నేపథ్యంలో ఆనాడు కనిపించిన ఆగ్రహజ్వాలల తాలూకు నిరసనలు మళ్లీ ఇప్పుడు కనిపించినట్లైంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలు దహనం చేశారు ఉద్యమకారులు, టీఆర్ఎస్ నేతలు. ఎన్నో సందర్భాల్లో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు దరిమిలా రాష్ట్రంలో అలాంటి నిరసనలు కరువైనట్లు కనిపించింది సిట్యువేషన్. అయితే ఆనాటి ఉద్యమపు జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చర్చానీయాంశమైంది.

తెలంగాణ ఉద్యమ ఛాయలు మళ్లీనా..?

తెలంగాణ ఉద్యమ ఛాయలు మళ్లీనా..?

తెలంగాణలో మళ్లీ ఉద్యమ కాలపు దారులు కనిపిస్తున్నాయా? ఆనాటి ఆగ్రహ జ్వాలలకు ప్రతిరూపంగా మళ్లీ నిరసనలు ఊపందుకుంటున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటన సమాధానంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దరిమిలా నిరసనలు అంత పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. కానీ ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం హాట్ టాపికయింది.

ఆనాడు ఉద్యమంలో తెగించి కొట్లాడిన ఉద్యమకారులు, టీఆర్ఎస్ లీడర్లు చీటికిమాటికీ నిరసనలకు దిగేవారు. కేంద్రంతో పాటు ఉమ్మడి ఏపీలో అధికారంలో కొలువుదీరిన అప్పటి కాంగ్రెస్ నేతలకు ఓ రకంగా చుక్కలు చూపెట్టారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ క్రమంలో చాలామంది యువత ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యారు. ఢిల్లీ పెద్దలకు తెలంగాణ వాణి వినిపించేలా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో వాళ్లు దిగొచ్చారు. ఆ మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు.

చిల్లరేసి లక్షలు దోచారు.. వనస్థలిపురం చోరీ కేసు.. నిందితులు అరెస్ట్ (వీడియో)

 ఓయూలో నిరసన జ్వాల

ఓయూలో నిరసన జ్వాల

అప్పటి ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు సంబంధించి చాలామంది దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఊ అంటే చాలు ఎవరో ఒకరిది కాంగ్రెస్ నేత దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఆనవాయితీగా ఉండేది. ఆ క్రమంలో నిరసన జ్వాల ఢిల్లీకి చేరి అక్కడ పెద్దలు దిగొచ్చి తెలంగాణ విభజనకు సై అన్నారు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక దిష్టిబొమ్మల దహనం పూర్తిగా కనుమరుగైనట్లు కనిపించింది సిట్యువేషన్.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గళం విప్పినా.. అది అంతవరకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో మాత్రం దిష్టిబొమ్మల జోలికి వెళ్లిన ఘటనలు అరుదనే చెప్పాలి. ఇక సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకాలు జరిగినా సందర్భాలున్నాయి. కాని ఆయన దిష్టిబొమ్మలు కాల్చిన ఘటనలు చాలా తక్కువే మరి. ఆ నేపథ్యంలో ఓయూ తెలంగాణ జన సమితి నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం చర్చానీయాంశమైంది.

ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు ఉధృతమవుతున్నాయి. ఆ క్రమంలో వారికి మద్దతు ప్రకటించారు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం. దాంతో మరొకసారి బుధవారం నాడు అమ్రాబాద్ యాత్రకు బయలుదేరారు. అయితే ఆయనను పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. ఆ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన టీజేఎస్ నేతలు సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.

ఓయూ టీజేఎస్ ప్రెసిడెంట్ బాబు మహాజన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అమ్రాబాద్ వెళుతున్న సందర్భంలో అరెస్ట్ చేసిన కోదండరాంతో పాటు మిగతా నేతలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Telangana is again the trend. Against the backdrop of the movement, that days are now seen again. Then there were the effigies of the Congress leaders in the central government, the activists and the TRS leaders. In many cases, the flames of protest erupted. After the formation of Telangana, such protests in the state not appeared to be kind. However, the CM KCR scarecrow in OU has been debated as a reminder of the movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X