చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళ ఆత్మాభిమాన ప్రతీక: కరుణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం, రేపు చెన్నైకి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల తెలంగాణముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటన్నారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీల నాయకుడిగా దశాబ్దాల తరబడి సేవలందించారని కేసీఆర్ కొనియాడారు.

kcr express deep condolence to karunanidhis family

సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన నాయకుడు కరుణానిధి అని సీఎం కేసీఆర్ అన్నారు. కాగా, బుధవారం కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో కేసీఆర్ చెన్నైకి వెళ్లనున్నట్లు సమాచారం.

గవర్నర్ నర్సింహన్ కూడా కరుణానిధి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబసభ్యులకు, తమిళ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మృతి తమిళనాడుకే కాదు, దేశానికే తీరని లోటని నర్సింహన్ అన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao expressed deep condolence to Karunanidhi's family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X