వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఫాంహౌస్ ఉద్యోగుల పంచాయితీ.. అక్రమ సంబంధం..! ఉద్యోగం నుండి తొలగింపు..!!

|
Google Oneindia TeluguNews

జగదేవ్‌పూర్‌/హైదరాబాద్ : అపవిత్రం చేయడానికి ఏ ప్రదేశాన్ని కూడా కొంత మంది ఒదిలి పెట్టరు. అది గుడి గాని, బడి గాని, ఇంకేదైనా పవిత్ర ప్రదేశమైనా కొంతమంది సన్నాసులు వారి స్వలాభం కోసం పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు. ఇలాంటి సంఘటనే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫాంహౌస్ ఎర్రవల్లి లో చోటుచేసుకుంది. ఫాంహౌస్ లో పని చేసే సిబ్బంది అక్రమసంబంధాలు పెట్టుకుని ఫాంహౌస్ గౌరవానికి భంగం కలిగించారు. ఇదే పంచాయితీ చినికి చినికి గాలివానగా మారి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకునేంత వరకు వెళ్లింది. ఇదే అంశాన్ని సీరియస్ గా పరిగణించిన అదికారులు సదరు కేసులకు పాల్పడ్డ సిబ్బందిపై భహిష్కరణ వేటు వేసింది.

కేసీఆర్ ఫాంహౌస్ లో అక్రమ సంబంధాల సాగు..! పూర్తి స్తాయిలో చేతికొచ్చిన పంట..!!

కేసీఆర్ ఫాంహౌస్ లో అక్రమ సంబంధాల సాగు..! పూర్తి స్తాయిలో చేతికొచ్చిన పంట..!!

తన భార్య వేరొకరితో వెళ్లిపోయిందంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. పోలీసులు తననే కొట్టారని సీఎం చంద్రశేఖర్ రావు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసిన ఎల్లయ్య వాపోయాడు! బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం శివార్‌వెంకటాపూర్‌కు చెందిన ఎల్లయ్య, అతడి భార్య కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవసాయ క్షేత్రంలో కూలి పని చేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ఆంజనేయులు.. ఎల్లయ్య భార్యకు మాయమాటలు చెప్పి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను అతడు తీసుకెళ్లిపోయాడని ఎల్లయ్య ఆరోపిస్తున్నాడు.

తన భార్య వేరొకరితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేస్తే..! తననే కొట్టారని ఆవేదన..!!

తన భార్య వేరొకరితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేస్తే..! తననే కొట్టారని ఆవేదన..!!

భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియక బంధువుల ఇళ్లల్లో వెతికానని.. ఆమెను ఆంజనేయులు తీసుకువెళ్లాడని తెలియడంతో తనకు న్యాయం చేయాలని మర్కుక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించాడు. అయితే పోలీసులు మాత్రం.. కంప్లయింట్‌ తీసుకోలేదని, 'నీ భార్య 4రోజుల తర్వాత వస్తుంది పోరా' అంటూ ఆమెతో ఫోన్లో మాట్లాడించారని తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ ఒక వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా అది వైరల్‌ అయిందని.. దీంతో పోలీసులు శనివారం తాను ఇంట్లో ఉండగా వచ్చి తనపై దాడి చేసి, బెదిరించారని ఆరోపించాడు.

న్యాయం అడిగితే దాడి చేశారు..! దాడి చేయలేదన్న పోలీసులు..!!

న్యాయం అడిగితే దాడి చేశారు..! దాడి చేయలేదన్న పోలీసులు..!!

ఫామ్‌హౌజ్‌ బెటాలియన్‌ తన బంధువులను చితకబాదినట్టు తెలిపాడు. ఈ విషయంలో ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని ఆవేదన వెలిబుచ్చాడు. కాగా.. ఆంజనేయులు, ఎల్లయ్య మధ్య గొడవ జరుగుతున్నట్లు ఫాంహౌస్‌లో తెలియడంతో వారిద్దరినీ కొన్ని రోజుల క్రితమే పనిలో నుంచి తొలగించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎల్లయ్య కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

దాడి చేయలేదు..! విచారణకు మాత్రమే పిలిపించామన్న సీఐ..!!

దాడి చేయలేదు..! విచారణకు మాత్రమే పిలిపించామన్న సీఐ..!!

ఎల్లయ్యపై మేం దాడి చేయలేదని శివలింగం, గజ్వేల్‌ రూరల్‌ సీఐ చెప్పుకొచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసి గ్రామానికి వెళ్లి.. అందరినీ శాంతింపజేసి పంపించాం. ఎల్లయ్య తన భార్యపై చేస్తున్న ఆరోపణలు అబద్ధం. అతని వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఎల్లయ్యకు విడాకుల నోటీసులు పంపిస్తున్నట్లు ఆమె తెలిపింది. గ్రామపెద్దల సమక్షంలోనే ఈ వ్యవహారం జరిగిందని సీఐ తెలిపారు.

English summary
Telangana Chief Minister Chandrasekhar Rao's farmhouse has taken place in Erravalli. Staff working in the farmhouse have been charged with illicit affairs and disrupting the dignity of the farmhouse. The same panchayat became a raging windmill and went on to file cases at the police station. The same issue has been treated as a serious threat by the boycott of the staff involved in the cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X