• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్టీని వీడిన ఎంపీ, ఎమ్మెల్సీలే KCR ఫస్ట్ టార్గెట్.. నెక్స్ట్ ఏంటో తెలుసా?

|
  KCR ఫస్ట్ టార్గెట్ వాళ్ళే.. నెక్స్ట్ ఏంటో తెలుసా? | Oneindia Telugu

  హైదరాబాద్ : రెండోసారి అధికారంలోకి వచ్చాక గులాబీ బాస్ కేసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. స్టెప్ బై స్టెప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. సన్నిహితుడు మహమూద్ అలీకి హోంశాఖ, తనయుడు కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అందులో భాగమేననే విషయం స్పష్టమవుతోంది. అదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయంగా కేసీఆర్ తీసుకోబోయే మరికొన్ని నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారనున్నట్లు సమాచారం.

  దశలవారీగా కేసీఆర్ నిర్ణయాలు సంచలనాలుగా మారబోతున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంతకు ఆయన ఏం చేయనున్నారనేది చర్చానీయాంశంగా మారింది.

  మొదటి స్టెప్ ఇదేనా?

  మొదటి స్టెప్ ఇదేనా?

  ఈసారి ఎన్నికల్లో కొన్నిచోట్ల టీఆర్ఎస్ మంత్రులు ఓడిపోవడం గులాబీవనంలో జీర్ణించుకోలేని అంశం. అయితే ఫలితాలు వచ్చాక మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయా మంత్రుల ఓటమిని అంగీకరించారు. కొన్ని తప్పులు జరిగాయని.. ఇకపై జరగకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయడమే గాకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా తొలుత పార్టీ వీడిన ఎంపీ, ఎమ్మెల్సీలపై వేటుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ గూటికి చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని డిసైడయ్యారు. అలాగే నలుగురు ఎమ్మెల్సీలు కొండా మురళి, రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డి లపై అనర్హత వేటు వేయనున్నారు.

  రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)

  సెకండ్ టార్గెట్

  సెకండ్ టార్గెట్

  ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాట్లాడిన తీరు ఆయన సెకండ్ టార్గెట్ గా కనిపిస్తోంది. ఏపీలో ఉండాల్సిన చంద్రబాబుకు ఇక్కడేం పనంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్.. ఆయనపై కసి తీర్చుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన కేసీఆర్.. చంద్రబాబు నాకో గిఫ్ట్ ఇచ్చాడు, తిరిగి ఇవ్వడం సంస్కారం కదా అంటూ చురకలు అంటించారు.

  ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు కేసీఆర్. ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంలో 5వేల కోట్ల రూపాయలు తిన్నారని ఆరోపించారు. తెలంగాణలో తమది తొలి ప్రభుత్వం కాబట్టి వీరిని పట్టించుకోలేదని, కేవలం అభివృద్దిపై దృష్టి పెట్టామని వ్యాఖ్యానించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వారి నుంచి తిన్నదంతా కక్కిస్తా అంటూ హాట్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి, డీకే అరుణ లాంటి వారిపై కూడా మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు, మహాకూటమి టార్గెట్ గా కేసీఆర్ రెండో ఫేజ్ ఉండబోతోందనే వాదన వినిపిస్తోంది.

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)

  మూడవ దశ

  మూడవ దశ

  కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాల వైపు చూస్తున్న కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా మారనున్నారు. అంటే ఆయన నిర్దేశించుకున్న దాని ప్రకారం ఇది మూడవ దశ కిందకు రానుంది. ఆయన తనయుడు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం అందులో భాగంగా కనిపిస్తోంది. పార్టీ బాధ్యతలను కేటీఆర్ భుజస్కందాలపై పెడుతూ ఆయనను నెంబర్ 2 గా అధికారికంగా ప్రకటించేశారు. దీన్నిబట్టి మెల్లిమెల్లిగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారిస్తారనే విషయం అర్థమవుతోంది.

  English summary
  After coming to power for the second time, the pink boss KCR seems to be moving forward. Step by step is going to make important decisions. first stage action against mp and mlc's who left the party. KCR second target may be on chandra babu naidu and mahakutami leaders. KCR is the key to the formation of the Federal Front. That is what he has directed Accordingly, it will come under the third stage.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more