హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెండా ఊపిన కేసీఆర్: 'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, నాటి గంగా- జమున సంప్రదాయం మళ్లీ మనలో జీవం పోసుకొనేందుకు అల్లా అతిథులుగా మక్కా వెళుతున్న హజ్ యాత్రికులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.

సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా నగరాల్లో ఈ నెల చివరకు జరగనున్న హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులకు బుధవారం రాత్రి సీఎం హజ్‌హౌస్ వద్ద వీడ్కోలు పలికారు. హజ్ శిబిరాన్ని సందర్శించి యాత్రికులను పలకరించారు. హజ్ యాత్రికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఉర్దూలో ప్రసంగించారు.

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే అదృష్టం అందరికీ దక్కదని, అలాంటి అదృష్టం వరించినందుకు సంతోషపడాలన్నారు. అల్లా అతిథులుగా వెళ్తు మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి, గంగా- జమున సంప్రదాయం శాశ్వతంగా కొనసాగుతూ ప్రజలంతా శాంతి సామరస్యం, సుఖ సంతోషాలతో వర్దిల్లేలా ప్రార్థించాలని కోరారు.

 'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

హజ్‌లో చేసే ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయన్నారు. హజ్‌కు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లేవారికి మక్కాలో ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉంటుందన్నారు. నిజాం నవాబు ఆరోజుల్లో హజ్‌కు వెళ్లే తన రాజ్య యాత్రికుల సౌకర్యార్ధం మక్కాలోని కబాకు పక్కనే నిజాం రుబాత్‌ను ఏర్పాటు చేశారని, నేడు రాష్ట్ర యాత్రికులు అందులో బస చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.

 'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

ఇక హజ్ యాత్రకు బుధవారం నగరం నుంచి బయలుదేరి వెళ్లిన తొలి బృందంలో 1020 మంది ఉన్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన మూడు ప్రత్యేక విమానాల్లో యాత్రికులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీలోని జెద్దాకు పయనమయ్యారు.

 'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

ఈ బృందానికి ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జెండా ఊపి వీడ్కోలు పలికారు. తొలి బృందం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జెద్దాకు చేరుకున్నట్లు హజ్ కమిటీ ఎస్‌వో షుకూర్ తెలిపారు. చివరి బృందం ఈ నెల 8న హజ్‌కు వెళ్ళనున్నది.

 'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

మక్కాలోని నిజాం రుబాత్‌లో గత రెండేండ్లుగా నిలిచిపోయిన వసతి సౌకర్యాలు సీఎం కేసీఆర్ చొరవతోనే తిరిగి ప్రారంభమయ్యాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. రుబాత్‌లో గతంలో కేవలం వసతి మాత్రమే కల్పించేవారని, ఇప్పుడు భోజనం, లాండ్రీ, ఇతర అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నారని తెలిపారు.

 'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం నేతృత్వంలో హజ్ యాత్రికుల సౌకర్యాల కల్పన విషయంలో ఎన్నో మార్పులు తెచ్చినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్‌ఏ షుకూర్ తెలిపారు. హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి సుమారు ఆరువేల మంది ఈ సారి హజ్‌యాత్రకు వెళుతున్నారని వెల్లడించారు.

 'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

'తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి'

వీరిలో తెలంగాణ రాష్ట్ర యాత్రికులు మూడు వేలమంది ఉన్నారన్నారు. జామే నిజామియా ఇస్లామిక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్‌అహ్మద్, జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Telangana Chief Minister K. Chandrasekhara Rao said that he has a dream of developing the Telangana state and maintain the composite culture of the state. Speaking to the Haj pilgrims at the Haj Camp, Nampally, Hyderabad he requested them to pray for fulfilling his dream and for the development of the state and progress and welfare of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X