వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ ప్రొఫెసర్ సారూ అన్న కేసీఆర్ ... సీతారాం నాయక్ కు షాక్ ఇవ్వటానికి కారణం ఇదేనా

|
Google Oneindia TeluguNews

లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 16 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారం నాయక్ కు షాక్ ఇచ్చిన గులాబీ బాస్ ఆ స్థానం నుండి రెడ్యా నాయక్ కుమార్తె మాలోతు కవితకు ఎంపీగా టికెట్ కేటాయించారు. దీంతో సీతారాం నాయక్ ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారు . ఎంపీ పనితీరు పట్ల స్థానిక నేతల అసంతృప్తి ఆయనకు టికెట్ రాకపోవటానికి కారణం అని తెలుస్తుంది.

 ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటే ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటే

అసెంబ్లీ ఎన్నికల నాటి నుండే డైలమా ...కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం ఒక కారణం

అసెంబ్లీ ఎన్నికల నాటి నుండే డైలమా ...కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం ఒక కారణం


ఊహించని విధంగా 2014లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి టికెట్ దక్కించుకున్న సీతారాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ పై విజయం సాధించి ఎంపీ అయ్యారు. కానీ ఆయన పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన తాను టిఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, తనమీద కావాలని కాంగ్రెస్ నాయకులు బురద జల్లుతున్నారని ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు.

ఆరా తీసిన గులాబీ బాస్ ... ఎంపీ పనితీరుపై అసంతృప్తి

ఆరా తీసిన గులాబీ బాస్ ... ఎంపీ పనితీరుపై అసంతృప్తి

ఇక ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పనితీరుపై ఎమ్మెల్యేలను, పార్టీ నాయకత్వాన్ని అడిగి తెలుసుకున్నారు. పెద్దగా ఆయన పైన వివాదాలు లేనప్పటికీ అందరితో సమన్వయం ఉండదు అని , చురుకుగా కూడా వ్యవహరించలేరని , స్థిరంగా ఉండలేక పోవడం వంటి లోపాలను గులాబీ బాస్ కెసిఆర్ ముందు పెట్టారు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు .

మాజీమంత్రి చందూలాల్ సైతం టికెట్ కోసం ప్రయత్నం

మాజీమంత్రి చందూలాల్ సైతం టికెట్ కోసం ప్రయత్నం

అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మంత్రి అజ్మీర చందూలాల్ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఈసారి తనకు టిక్కెట్ కేటాయించాలని ప్రయత్నాలు చేశారు. ఇక తన సిట్టింగ్ స్థానం తనకే కేటాయించాలని ప్రొఫెసర్ సీతారాం నాయక్ సైతం పావులు కదిపారు. ములుగు నుండి ఇద్దరు నేతలు టికెట్ కావాలని కోరడంతో వీరిద్దరిని కాదని మానుకోట నుండి మాలోతు కవిత కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

రెడ్యా నాయక్ కు మంత్రి ఇవ్వలేదు కాబట్టే కూతురు మాలోతు కవితకు ఎంపీ గా అవకాశం

రెడ్యా నాయక్ కు మంత్రి ఇవ్వలేదు కాబట్టే కూతురు మాలోతు కవితకు ఎంపీ గా అవకాశం


రెడ్యానాయక్ మంత్రిగా అవకాశం ఇస్తారని భావించిన నేపథ్యంలో, రెడ్యానాయక్ కు మంత్రిగా స్థానం ఇవ్వలేదు కాబట్టే ఆయన కుమార్తె మాలోతు కవిత కు ఎంపీ గా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా తన సిట్టింగ్ స్థానం తనకే దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్న ప్రొఫెసర్ సార్ కు సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అజ్మీర సీతారాం నాయక్ దారెటు అన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు తానేం నేరం చేశానో తెలియదని, తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం తీరని అన్యాయం అని ప్రొఫెసర్ సీతారాం నాయక్ లబోదిబోమంటున్నారు.

English summary
CM KCR announced the candidates' list of Lok sabha elections . It is known that the TRS will field its candidates for 16 Lok Sabha seats. CM KCR gave shock to the Mahaboobababd sitting MP professor Seetharam nayak as he is facing allegations from the local cadre and he also charged that he was tried to jump from the party in the time of assembly elections .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X