వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌వాసులకు కేసీఆర్ వరాలు, 'కృష్ణా'పై కేంద్రం లాయర్‌పై సుప్రీం అగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రేటర్ హైదరాబాద్‌వాసులపై వరాల జల్లు కురిపించారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన నగరవాసుల పైన కరుణ చూపించారని చెప్పవచ్చు.

నగరంలోని విద్యుత్, నల్లా నీటి బకాయిలను మాఫీ చేయాలని నిర్ణయించారు. నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, అధికారులతో సీఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బకాయిలు రద్దు చేయాలని నిర్ణయించారు.

దీంతో, ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.128 కోట్లు, మంచి నీటి బిల్లుల బకాయిలు రూ.290 కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఉత్తర్వులు తదుపరి జారీ చేయనన్నారు.

KCR gift to Hyderabad people

కృష్ణా జలాల రగడ: కేంద్రం లాయర్ పైన సుప్రీం ఆగ్రహం

కృష్ణా నది జలాల పంపిణీ పైన తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై తెలంగాణ తరఫున వైద్యనాథన్ తమ వాదనలు వినిపించారు. మొదటి నుంచి తెలంగాణ హక్కులను కాపాడలేదని, నీటి పంపకాలకు సంబంధించి వాదనలు వినాలని తెలంగాణ న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

కృష్ణా జలాల పంపిణీ పైన కేంద్రం తన వైఖరి ఇప్పటి వరకు చెప్పకపోవడంపై సుప్రీం కోర్టు కేంద్రం తరఫు న్యాయవాదిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చెప్పకపోవడమేమిటని ప్రశ్నించింది. పదిహేను నిమిషాల్లో పూర్తి వివరాలు ముందుంచాలని చెప్పింది. న్యాయవాదిగా మీరు పని చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. అనంతరం విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది.

English summary
Telangana Chief Minister KCR gift to Hyderabad people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X