• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్టీఫెన్‌సన్‌ త్యాగానికి ఫలితం...కేసీఆర్ గిఫ్ట్

|

హైదరాబాద్‌ : స్టీఫెన్‌సన్‌ త్యాగానికి ఫలితం దక్కింది. టీఆర్ఎస్ కు చేసిన మేలు కారణంగా మళ్లీ కొలువు కుదిరింది. ఓటుకు నోటు కేసులో చేసిన సాయానికి ప్రతిఫలం దొరికింది. నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి తిరిగి వెతుక్కుంటూ వచ్చింది.

ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం లీడర్లు అడ్డంగా బుక్కయ్యారు. ఎమ్మెల్సీకి ఓటు వేసే విషయంలో స్టీఫెన్‌సన్‌ ను ప్రలోభపెడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు రావడంతో అప్పట్లో ఈకేసు సంచలనం రేపింది. టీఆర్ఎస్ కు స్టీఫెన్‌సన్‌ అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. అయితే ఆ కేసులో భాగంగా స్టీఫెన్‌సన్‌ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. మొత్తానికి స్టీఫెన్‌సన్‌ చేసిన సాయానికి గుర్తుగా నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమైన్నట్లు సమాచారం.

నామినేటెడ్ ఎమ్మెల్యే

నామినేటెడ్ ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 120. అందులో 119 మంది ఎన్నికల ద్వారా గెలిచి శాసనసభలో అడుగుపెడతారు. ఇంకొకరు మాత్రం నామినేటెడ్ పదవితో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. అందులోభాగంగా ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ ను నియమించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఈమేరకు తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానమైంది. ఆయన నియామకానికి సంబంధించిన ప్రతిని గవర్నర్ నరసింహన్ ఆమోదం కొరకు పంపించారు. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్ సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

 మరోసారి కలిసొచ్చి..!

మరోసారి కలిసొచ్చి..!

2014లో తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన స్టీఫెన్‌సన్‌.. ఓటుకు నోటు కేసుతో చర్చానీయాంశంగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసే అవకాశముండటంతో టీడీపీ నేతలు బేరసారాలకు దిగారు. మా అభ్యర్థికి ఓటు వేస్తే మీకింత అంటూ ప్రలోభాలకు గురిచేశారు. అయితే అదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం కాస్తా రచ్చరచ్చయింది. టీడీపీ నేతలను ఇరకాటంలోకి నెట్టాలని చూసిన టీఆర్ఎస్ ప్రయత్నాలకు స్టీఫెన్‌సన్‌ సహకారమందించారు. ఆ వీడియోక్లిప్పులు బయటపెట్టడంతో టీడీపీ నేతలపై కేసు నమోదవ్వడమే గాకుండా టీఆర్ఎస్ కు ప్లస్ అయినట్లయింది. దీంతో ఆయనకు మళ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినట్లైంది.

నాకది నీకిది.. అందుకే మళ్లీ..!

నాకది నీకిది.. అందుకే మళ్లీ..!

తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డారనేది టీఆర్ఎస్ ఆగ్రహం. దీన్ని ధృవీకరిస్తూ ఆ పార్టీ నేతలు చాలా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అయితే టీడీపీ లీడర్లపై అక్కసు వెళ్లగక్కే సమయం కోసం ఎదురుచూసిన టీఆర్ఎస్ కు ఓటుకు నోటు అంశం కలిసొచ్చింది. స్టీఫెన్‌సన్‌ తో టీడీపీ నేతలు నెరిపిన రాయబారం వీడియో క్లిప్పులు అనూహ్యంగా బయటకొచ్చాయి. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ కు స్టీఫెన్‌సన్‌ సహకరించారు. ఆ సమయంలో స్టీఫెన్‌సన్‌ చేసిన సాయానికి గుర్తుగానే మరోసారి నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి దక్కినట్లైంది. ఆయనకు కూడా సాధారణ ఎమ్మెల్యేలతో పాటే సమాన అవకాశాలు ఉంటాయి. మండలితో పాటు రాజ్యసభలో కూడా ఓటు వేసే ఛాన్సుంటుంది.

English summary
Stephenson's sacrifice was the result. note for vote case may fruitful to stephenson. Nominated mla post returns to stephenson as he helped for trs in note for vote case. TRS Party given priorty once again to him as nominated mla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X