హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ తేల్చేశారు: 'ఓటకు నోటు'పై ఎవరికీ తలొగ్గవద్దు, బాబుకు మళ్లీ కష్టాలేనా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు బయటపడ్డ సమయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఒకరిపై ఒకరు ఎన్నేసి మాటలనుకున్నారో అందరికీ తెలిసిందే. 'చంద్రబాబూ.. నిన్ను ఇక ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు' అని కేసీఆర్ అంటే.. 'మాకూ.. ఏసీబీ ఉంది, మా ఫోన్లనే ట్యాప్ చేస్తారా?' అంటూ అప్పట్లో చంద్రబాబు పోటాపోటీ వ్యాఖ్యలు చేశారు. క్రమేపీ ఆ వేడి పూర్తిగా చల్లారి.. మొన్నీమధ్యే కేసీఆర్ 'చంద్రబాబు నాకు మంచి మిత్రుడే...' అని స్టేట్ మెంట్ ఇచ్చేదాకా వచ్చింది. ఇంతదాకా బాగానే ఉంది కానీ.. ఉన్నట్టుండి ఇప్పుడు 'ఓటుకు నోటు' కేసు తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ ఏమన్నారు?:

కేసీఆర్ ఏమన్నారు?:


డబుల్ బెడ్ రూం, పోలీస్ శాఖలో నియామకాలు, రెవెన్యూ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఈ సందర్భంగా ఓటుకు నోటు గురించి కూడా చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చర్చించడమే కాదు, 'చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేసులో చార్జిషీట్‌ దాఖలు చేయాల్సిందే' అని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పేశారట. అంటే, ఎంతటివారైనా సరే మీరు ఉపేక్షించవద్దన్న రీతిలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చు. దీంతో ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగనున్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి.

చంద్రబాబు ఏ-1గా?:

చంద్రబాబు ఏ-1గా?:

ఓటుకు నోటు కేసులో ఇప్పటిదాకా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏ-1నిందితుడిగా ఉన్నారు. కానీ చంఢీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఆడియో టేపుల నివేదిక రావడంతో.. ఏ-1గా చంద్రబాబును చేర్చాల్సి ఉంటుందని అధికారులు సీఎం కేసీఆర్ తో చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, చట్ట ప్రకారం మీ పని మీరు చేసుకుపోవాలని కేసీఆర్ వాళ్లకు సూచించారు.

కేసు ఎక్కడిదాకా వచ్చింది?:

కేసు ఎక్కడిదాకా వచ్చింది?:

ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ గతంలొ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతొ ఏపీ సీఎం చంద్రబాబు సహా తదితరులపై దర్యాప్తుకు ఏసీబీని ప్రత్యేక ఏసీబీ కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు దీన్ని పక్కనబెట్టడంతో ఎమ్మెల్యే ఆళ్ల సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాన్ని ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ప్రస్తుతం సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంలో కేసు విచారణలో ఉంది.

కౌంటర్ దాఖలు చేసే పనుల్లో:

కౌంటర్ దాఖలు చేసే పనుల్లో:

సుప్రీం విచారణ నేపథ్యంలో.. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం కూడా కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో గత వారం రోజుల నుంచి ఛార్జీషీట్ పై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఓటుకు నోటు కేసు వివరాలపై ఆరా తీశారు. ఫోరెన్సిక్ నివేదిక విషయాలను అడిగి తెలుసుకున్నారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

English summary
It appears the noose is gradually tightening around Telugu Desam Party president and Andhra Pradesh chief minister N Chandrababu Naidu in cash-for-vote case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X