వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో స్థానంలో తెలంగాణ, ప్రయత్నించడం లేదు: కెసిఆర్ ప్రభుత్వంపై కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు ఆత్మహత్యలన్నింటికీ గత ప్రభుత్వాల ప్రభావమే కారణమని తెలంగాణ జెఎసి చైర్మ న్ కోదండరామ్ అన్నారు. రైతుల ఆత్మహత్యల నిరోధానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రయత్నించడం లేదని ఆయన అన్నారు.

ఢిల్లీలో ఆల్ అస్సాం విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారంనాడు నిర్వహించిన చిన్న రాష్ట్రాల సదస్సులో ఆయన ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని, విదర్భ తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

KCR government not doing enough to stop farmers suicides: Kodandaram

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరగడంలేదనే వాదనలో నిజం లేదని, నిరుడు 800 మంది రైతులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో మరిన్ని చిన్న రాష్ట్రాలు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏర్పడే చిన్న రాష్ట్రాలకు తెలంగాణ సమాజం మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కేంద్ర కార్మిక శాఖ సహయ మంత్రి దత్తాత్రేయ, కోదండరామ్ మంగళవారం కలిశారు. వారితోపాటు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు కూడా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటుచేయాలని వారు వినతిప్రతం సమర్పించారు. హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

English summary
Telangana JAC chairman Kodandaram said that Telangana CM K Chandrasekhar rao government is not doing enough to stop farmers suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X