వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలిని: కెసిఆర్‌పై పూనమ్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్, ఎంఐఎంలతో సీఎం కేసీఆర్‌ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం విమర్శించారు.తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలిని అంటూ బిజెవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహజన్ కెసిఆర్‌ తీరును దుయ్యబట్టారు.

బాల్య మిత్రుడికి కెసిఆర్ పరామర్శ, ఆర్నెళ్ళ తర్వాత...బాల్య మిత్రుడికి కెసిఆర్ పరామర్శ, ఆర్నెళ్ళ తర్వాత...

'నిరుద్యోగుల సమరభేరి" పేరిట బీజేవైఎం ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ సభ నిర్వహించింది.ఈ సభలో పూనమ్ మహజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సభలో కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

జీఈఎస్ 2017 స్పీకర్స్ లిస్ట్ ఇదే: సానియా, మిథాలీరాజ్, మానుషి చిల్లర్, గోపిచంద్‌కు చోటుజీఈఎస్ 2017 స్పీకర్స్ లిస్ట్ ఇదే: సానియా, మిథాలీరాజ్, మానుషి చిల్లర్, గోపిచంద్‌కు చోటు

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన హమీలను అమలు చేయలేదని పూనమ్ గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయకుండానే కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు.

తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలిని

తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలిని


'నిరుద్యోగుల సమరభేరి పేరుతో బిజెపి నిర్వహించిన సభలో ఆమె పూనమ్ మహజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డను ఆంధ్రకు కోడలిని అని తెలిపారు. తెలంగాణ ఖుష్భు మహాజన్ రక్తంలో ఉందన్నారు. తెలంగాణ సర్కార్ పై ఈ సభ యుద్ధ భేరి అని తెలిపారు.ఢమరుకం వాయించి సమరభేరి మోగించి కార్యకర్తలను పూనమ్‌ ఉత్సాహపరిచారు. పూనమ్ మహజన్ తండ్రి ప్రమోద్ మహజన్ మహబూబ్‌నగర్‌లో పుట్టారు. ఆ తర్వాత మహరాష్ట్రలో ప్రమోద్ మహజన్ గడిపారు. పూనమ్ మహజన్ వ్యాపారవేత్త ఆనంద్‌రావు వాజెండ్లను వివాహం చేసుకున్నారు. ఆనంద్‌రావు పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు.

టిఆర్ఎస్ ఓ ప్రైవేట్ కంపెనీ

టిఆర్ఎస్ ఓ ప్రైవేట్ కంపెనీ


అధికార టీఆర్‌ఎస్ ఒక ప్రయివేట్ లిమిటెడ్ పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జనవరిలో జరిగే ర్యాలీలో బైక్ పై తానే ముందుంటానని పూనమ్‌ తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బిజెపి కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.తెలంగాణ యువకుల స్వప్నాలను కెసిఆర్ నీరుగార్చారని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్, ఎంఐఎంతో దోస్తీ

కాంగ్రెస్, ఎంఐఎంతో దోస్తీ

కెసిఆర్ ఉదయం పూట కాంగ్రెస్, రాత్రి పూట ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని పూనమ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చిన కెసిఆర్ , తన అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు.

నిజాంను కీర్తించడానికి బిజెపి వ్యతిరేకం

నిజాంను కీర్తించడానికి బిజెపి వ్యతిరేకం

నిజాంను కేసీఆర్‌ పొగడటాన్ని బీజేపీ సహించబోదని స్పష్టం చేశారు. కేసీఆర్..కలెక్టర్ ఆఫీస్‌లు వచ్చాయి.. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడిస్తావ్ అని పూనం మహాజాన్‌ సూటిగా ప్రశ్నించారు. క్యా హువా తేరా వాదా అని బీజేవైఎం కేసీఆర్ ను నిలదీస్తుందని చెప్పారు.

English summary
Bjym national president poonam Mahajan made allegations on Telangana CM KCR. poonam participated BJYM sabha on Sunday at Hyderabad. KCR government ignored his promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X