వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం మాకు వదిలేయాలి, 50 శాతం ఉండాలని ఎక్కడా లేదు: కేసీఆర్‌ను ఇరుకున పడేసిన జీవన్ రెడ్డి

తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడం చారిత్రాత్మకం అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే పెంపు బిల్లు ప్రవేశ పెడుతున్నామని కేసీఆర్ చెప్పారు. కొందరు ఈ బిల్లును అడ్డు పెట్టుకొని అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ తరహా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని చెప్పారు.

ముస్లీం రిజర్వేషన్ బిల్లు: టైర్లలో గాలి తీసేశారు, బీజేవైఎం నేతల అరెస్ట్ముస్లీం రిజర్వేషన్ బిల్లు: టైర్లలో గాలి తీసేశారు, బీజేవైఎం నేతల అరెస్ట్

ఈ రిజర్వేషన్ల పెంపు వల్ల బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. ఈ బిల్లుతో ఎవరూ ఇబ్బంది పడరని తెలిపారు. సామాజిక, ఆర్థిక ప్రాతిపదికనే ఈ బిల్లు పెంపును ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో 107 సభల్లో చెప్పానని తెలిపారు.

సమైక్య ఏపీలో గిరిజన జనాభా ఆరు శాతానికి పైగా ఉందని, తెలంగాణలో మాత్రం 9 శాతానికి పైగా ఉందన్నారు. ఉప కులాలు కలిస్తే పది శాతానికి చేరుకుంటుందన్నారు. కాబట్టి గిరిజనులకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.

భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి

భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి

తాను భారత ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఇది రికార్డులో ఉండాలని, అందుకే సభలో చెప్పానని అన్నారు. ఉద్యోగాల విషయంలోను రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలన్నారు.

రిజర్వేషన్లు కేవలం యాభై శాతం ఉండాలని ఎక్కడా లేదన్నారు. జార్ఖండ్‌లో 60 శాతం, మహారాష్ట్రలో 52 శాతం, తమిళనాడులో అరవై శాతానికి పైగా రిజర్వేషన్లు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఒక శాతం పెంచుతామని చెప్పారు. ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.

మాకే వదిలేయండి

మాకే వదిలేయండి

రిజర్వేషన్లు నిర్ణించుకునే అధికారం కేంద్రం రాష్ట్రానికి వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను కూడా రాష్ట్రాలకు వదిలేయాలన్నారు. అలాగైతే దేశంలో ఘర్షణాత్మక వైఖరి తగ్గుతుందన్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

అది మా ఘనతే.. జీవన్ రెడ్డి

అది మా ఘనతే.. జీవన్ రెడ్డి

వెనుకబడ్డ ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆ పార్టీ నేత జీవన్ రెడ్డి అన్నారు. కొన్ని పార్టీలు ఈ బిల్లును మత కోణంలో ఆలోచించడం సరికాదన్నారు. నాలుగు నెలల్లోనే రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చేశారా అని, ఆ ఫలాలు అందాయా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.

దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. నాలుగు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని, కానీ అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత అన్నారు. కానీ తాము ఇచ్చిన హామీ మేరకు దానిని అమలు చేస్తున్నామన్నారు.

కేసీఆర్‌ను ఇరుకున పడేసిన జీవన్ రెడ్డి

కేసీఆర్‌ను ఇరుకున పడేసిన జీవన్ రెడ్డి

ఈ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలుపుతుందని విశ్వాసం ఉందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దానికి కేసీఆర్ మాట్లాడుతూ.. అలా మాట్లాడటం సరికాదన్నారు. తమకు ఆ విశ్వాసం ఉందని చెప్పారు. తమిళనాడు తరహా తెలంగాణ రిజర్వేషన్లను కూడా కేంద్రం 9వ షెడ్యూల్‌లో పెట్టాలన్నారు. లేదంటే తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు.

ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వకుంటే ఓటు అడగనని కేసీఆర్ చెప్పారని, మరి ఇప్పుడు ముస్లీంలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోతే తాను ఓటు అడగనని కేసీఆర్ చెప్పగలరా అని జీవన్ రెడ్డి ఇరుకున పడేసే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు కేవలం తమిళనాడుకే పరిమితం అన్నారు.

దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నారు. జీవన్ రెడ్డి తమను ఇరుకున పడేసే ప్రయత్నం చేస్తే అందులో విజయవంతం కాలేరని చెప్పారు. రాజకీయాల కోసం మాట్లాడటం తగదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కూడా రిజర్వేషన్లకు కేంద్రానికి అప్పీల్ చేసుకున్నాయని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనది అన్నారు.

బిల్లుపై నిరసనలు

బిల్లుపై నిరసనలు

మతప్రాదిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీకి పాదయాత్ర నిర్వహించారు. ముస్లీం రిజర్వేషన్ల కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని వారు మండిపడుతున్నారు.

బీసీలకు అన్యాయం: రేవంత్ రెడ్డి

బీసీలకు అన్యాయం: రేవంత్ రెడ్డి

మతప్రాదిపదికన రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని టిడిపి నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

అలాగే, నిన్న (శనివారం) తమకు బీఏసీలో అవమానం జరిగిందన్నారు. బీఏసీకి పిలిచి తమను అవమానించారన్నారు. సభలో తాము అన్యాయాన్ని నిలదీస్తామనే తమను లోపలకు రానివ్వడం లేదన్నారు. బీఏసీ సమావేశంలో లోపలకు వెళ్లి కూర్చున్న తర్వాత తమను బయటకు పంపించడం ఏమిటన్నారు.

కాగా, ఆదివారం రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
Telangana Chief Minister KCR introduced Muslim reservation bill in Assembly on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X