వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే టిఆర్ఎస్‌లో చేరలేదు, భరతసింహారెడ్డి ఫోన్, బిజెపికి అంత సీన్ లేదు: నాగం నిప్పులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిఆర్ఎస్‌లో రావాలని కెసిఆర్ ఆహ్వనించారు. ఒక రోజు సుమారు 7 గంటలకు పైగా కెసిఆర్‌తో చర్చించినట్టు నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. కానీ, కెసిఆర్‌తో తనకు సరిపోదని భావించినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తన అనుచరులు కోరుకొంటున్నారని నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై తాను తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.

బిజెపికి నాగం రాజీనామా: అమిత్‌షాకు లేఖ, కాంగ్రెస్‌లోకేనా? బిజెపికి నాగం రాజీనామా: అమిత్‌షాకు లేఖ, కాంగ్రెస్‌లోకేనా?

మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగం జనార్ధన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. బిజెపికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులపై నాగం జనార్ధన్ రెడ్డి వివరించారు.

నాగం జనార్ధన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది కార్యకర్తలు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

కెసిఆర్ ఆహ్వనించారు

కెసిఆర్ ఆహ్వనించారు

టిఆర్ఎస్‌లో చేరాలని కెసిఆర్ తనను ఆహ్వనించారని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. ఒకరోజు సుమారు 7 గంటల పాటు కెసిఆర్ తనతో చర్చించారని ఆయన చెప్పారు. కానీ రాజకీయంగా తనకు కెసిఆర్‌కు సరిపోదని తాను కెసిఆర్‌కు చెప్పానని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. తనకు కెసిఆర్‌కు సరిపోదని భావించినందునే ఆ పార్టీలో చేరడం లేదన్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఉంటే, టిడిపి ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణలో తాము బలంగా ఉంటే కెసిఆర్ ఆటలు సాగవనే ఉద్దేశ్యంతో కెసిఆర్ పకడ్బందీ ఓయూలో తమపై దాడికి ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి నేతలు పోరాడరు

టిఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి నేతలు పోరాడరు

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు పోరాటం చేయరని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తనకు ఏ మాత్రం తోడ్పాటును అందించలేదని నాగం జనార్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వరంగల్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ జరిగిన మరునాడే మంత్రి హరీష్‌రావును బిజెపి నేత బండారు దత్తాత్రేయ సన్మానించడం కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలను ఇస్తోందన్నారు.

 భరత్‌సింహరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పిలిచారు.

భరత్‌సింహరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పిలిచారు.

తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాజీ మంత్రి డికె అరుణ భర్త, డికె భరతసింహరెడ్డి ఆహ్వనించారని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై తనతో రెండు సార్లు ఆయన ఇదివరకే మాట్లాడారని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో తనతో రాజకీయంగా ఎవరికీ విభేధాలు లేవని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు

 బిజెపి నేతలు నన్ను గెలిపించే ప్రయత్నం చేయలేదు

బిజెపి నేతలు నన్ను గెలిపించే ప్రయత్నం చేయలేదు

2014 ఎన్నికల సమయంలో తనకు మహబూబ్‌నగర్ పార్లమెంట్ టిక్కెట్టును, తన కొడుకు నాగర్ కర్నూల్ అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చారని చెప్పారు. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో తన గెలుపు కోసం బిజెపి నేతలు ప్రయత్నాలు చేయలేదన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తే తాను విజయం సాధించే వాడినని ఆయన చెప్పారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బిజెపి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిందన్నారు. నారాయణపేట అసెంబ్లీ స్థానంలో మిత్రపక్షంగా ఉన్న టిడిపి అభ్యర్ధికి వ్యతిరేకంగా బిజెపి అభ్యర్ధి రెబెల్‌గా నిలిపారని ఆయన గుర్తు చేశారు. అయినా తాను 30వేల ఓట్లతో ఓటమిపాలైనట్టు నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.

 ఇవే చివరి ఎన్నికలు

ఇవే చివరి ఎన్నికలు

2019 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కానున్నాయని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షరతులు పెట్టలేదన్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కూడ తాను చర్చించినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేద్దామని దామోదర్ రెడ్డి ఒప్పుకొన్నారని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానం ఎవరికీ టిక్కెట్టు ఇస్తే వారి గెలుపు కోసం ప్రయత్నం చేద్దామని భావించామన్నారు.తనకు దామోదర్ రెడ్డి షరతులు పెట్టడం హస్యస్పదమన్నారు.

నా కొడుకులు రాజకీయాల్లోకి రారు

నా కొడుకులు రాజకీయాల్లోకి రారు

తన ఇద్దరు కొడుకులు కూడ వైద్య వృత్తిలో సెటిలయ్యారని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. రాజకీయాల్లోకి వారు రారని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. గత ఎన్నికల సమయంలో తన పెద్ద కొడుకు నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగకపోతే బిజెపికి అన్ని ఓట్లు వచ్చేవి కావన్నారు. తాను నాగర్‌కర్నూల్ నుండి పోటీ చేసినా మర్రి జనార్ధన్ రెడ్డి విజయం సాధించేవాడు కాదని చెప్పారు.నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు పోటీయే ఉండదని ఆయన చెప్పారు.

English summary
Nagam Janardhan Reddy said that KCR was invited him to join in TRS, but he was not interested to join in TRS, he said, A telugu news channel interviewed him on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X