మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుతో ఏం మాట్లాడానంటే..!: గవర్నర్‌తో కెసిఆర్, పత్రిక ఇదే (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీసమేతంగా సోమవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు.

తాను నిర్వహిస్తున్న చండీయాగానికి వారిని కెసిఆర్ ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం తన సతీమణి శోభారాణి, మనువడు హిమాంశ్‌తో కలిసి కెసిఆర్ రాజ్ భవన్ వెళ్లారు.

గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమల వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చండీయాగం ఆహ్వాన పత్రికను అందించారు. సతీసమేతంగా రావాలని కోరారు.

గవర్నర్‌కు కెసిఆర్ ఆహ్వానం

గవర్నర్‌కు కెసిఆర్ ఆహ్వానం

గవర్నర్ నరసింహన్‌తో కెసిఆర్ ఏకాంతంగా అరగంటకు పైగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. గవర్నర్ నరసింహన్... ఆయుత చండీయాగం ఏర్పాట్లు, తదితరాల పైన ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి ఆరా తీశారు.

గవర్నర్‌కు కెసిఆర్ ఆహ్వానం

గవర్నర్‌కు కెసిఆర్ ఆహ్వానం

ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి సతీసమేతంగా రావాల్సిందిగా గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి దంపతులు ఆహ్వానించారు.

గవర్నర్‌కు కెసిఆర్ ఆహ్వానం

గవర్నర్‌కు కెసిఆర్ ఆహ్వానం

సోమవారం ఉదయం విజయవాడ వెళ్లి తిరిగొచ్చిన సిఎం కెసిఆర్, భార్య శోభ, మనమడితో కలిసి సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లారు.

గవర్నర్‌కు, జస్టిస్ సుదర్శన్ రెడ్డిలకు కెసిఆర్ ఆహ్వానం

గవర్నర్‌కు, జస్టిస్ సుదర్శన్ రెడ్డిలకు కెసిఆర్ ఆహ్వానం

గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, భార్య విమల దంపతులకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రం, పూలు, పండ్లతో కలిపి అయుత చండీయాగం ఆహ్వాన పత్రాన్ని అందించారు. కాగా, కెసిఆర్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించారు.

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

చండీయాగానికి రావాల్సిందిగా ఇదివరకే గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించినప్పటికీ, సతీమణి సహా వెళ్లి గవర్నర్ దంపతులకు సోమవారం ఆహ్వానపత్రం మర్యాదపూర్వకంగా అందించారు.

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

చండీయాగం ముగింపు రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాగానికి రానుండటంతో, ఆయనతోపాటు గవర్నర్ ఎలాగూ వస్తారని, అయితే అంతకుముందు ప్రత్యేకంగా ఒకరోజు గవర్నర్ దంపతులను యాగానికి వచ్చి వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారని సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రపతి వచ్చే రోజు రావాలని సూచించిన విషయం తెలిసిందే.

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

అరగంటకు పైగా గవర్నర్‌తో సమావేశమైన సీఎం కేసీఆర్.. అయుత చండీయాగం విశిష్టత, యాగం నిర్వహణ ఏర్పాట్ల తీరును వివరించారు.

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

కెసిఆర్ ఆహ్వాన పత్రిక

అదే సమయంలో వారి మధ్య చర్చల్లో... విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో భేటీ విషయం ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
Telangana CM KCR invites Governor couple to Chandi Yagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X