వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..! పరాకాష్టకు చేరిన సీఎం మూడనమ్మకాలన్న రేవంత్ రెడ్డి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. సచివాలయం,శాసనసభ భవంతుల నిర్మీణం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియ జెప్పాడానికే తాము సచివాలయ సందర్శన చేసినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపారు. సీఎం చంద్రశేఖర్ రావు సచివాలయ భవనాలను కడతానని అంటున్నారని, కాని రాష్ట్రం అనేక అవసరాల కోసం తెచ్చుకున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఉద్యోగం, వ్యవసాయం ఇలా అనేక అవసరాలు తీరాక కడితే బాగుండేదని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సరిపోయే అన్ని సదుపాయాలు, హంగులూ అసెంబ్లీకి, సచివాలయానికి ఉన్నాయన్నారు. వసతులు లేవు అని ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పేర్కొన్నారు.

Recommended Video

కేసీఆర్ కాళేశ్వరంపై బీజేపీతో బహిరంగ విచారణకు సిద్ధమా.?రఘునందన్
కొత్త నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్..! డబ్బు వృధా అన్న రేవంత్ రెడ్డి..!!

కొత్త నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్..! డబ్బు వృధా అన్న రేవంత్ రెడ్డి..!!

సచివాలయంలో అన్ని బ్లాకులు 10 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల కింద కట్టినవేనని తెలిపారు. అందరి అవసరాలు తీర్చే అతిపెద్దభవనం ఈ సచివాలయమన్నారు. సచివాలయంలో ఉన్న అన్ని బ్లాక్లు చాలా బాగున్నాయని పేర్కొన్నారు. సీఎంచంద్రశేఖర్ రావు మనసులో ఇక దుర్మార్గ ఆలోచన తట్టిందని విమర్శించారు. భవనాలపైన తన పేరు ఉండేలా చంద్రశేఖర్ రావు ఇలాంటి తప్పుడు నిధుల దుర్వినియోగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన తెవొద్దని కోరుతున్నాం.

కేసీఆర్ కు ముదిరిని మూఢనమ్మకాలు..! మండి పడ్డ రేవంత్..!!

కేసీఆర్ కు ముదిరిని మూఢనమ్మకాలు..! మండి పడ్డ రేవంత్..!!

చంద్రశేఖర్ రావు ముడనమ్మకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సచివాలయంలో ఏ భవనం కూడా 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించలేదు. ఇక్కడి భవనాలు 100 సంవత్సరాల కోసం నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సరిపోయింది సచివాలయం. ప్రస్తుతం సచివాలయ భవనాల విలువ 1000కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు కులుస్తున్నాడు. ప్రస్తుతం 400 కోట్లతో కడతానంటున్న చంద్రశేఖర్ రావు అంచనాలు పెంచుతారు. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానన్ చంద్రశేఖర్ రావు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఉచిత కేజీ టు పీజీ విద్య అన్న కేసీఆర్ ఆ భవనాలు నిర్మించాలి.

తలసానికి మైండ్ బ్లాంక్ అయ్యింది..! విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్..!!

తలసానికి మైండ్ బ్లాంక్ అయ్యింది..! విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్..!!

చంద్రశేఖర్ రావు కు చిత్త శుద్ధి ఉంటే విద్యార్థులకు భవిష్యత్తు కె9సామ్ నూతన విద్య భవనాలు నిర్మించాలన్నారు. అమరవీరుల స్తూపం ప్రపంచ వ్యాప్తంగా నిర్మిస్తానన్నాడు. అన్ని కులాలకు భవనాలు నిర్మిస్తానన్నాడు. లిటికేషన్ ఉన్న భూములు కేటాయించాడని విమర్శించారు. తాను మాత్రం 10 ఏకరాలల్లో ప్రగతి భవన్ కట్టుకున్నాడు. అన్ని కులాలకు సచివాలయంలో ఒక్కో ఫ్లోర్ కేటాయించాలి. ప్రతిపక్షాలను అడిగి నిర్ణయం తీసుకోవాల్సి న అవసరం లేదు అంటున్న తలమాసిన శ్రీనివాస యాదవ్ కు అలుగడ్డలు అమ్మిన బుద్ధి ఇంకా పోలేదని తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు.

కేసు న్యాయస్థానంలో ఉంది..! కూల్చుతామంటే ఊరుకునేది లేదన్న ఎంపీ..!!

కేసు న్యాయస్థానంలో ఉంది..! కూల్చుతామంటే ఊరుకునేది లేదన్న ఎంపీ..!!

నేను న్యాయస్థానంలో ప్రజా వ్యాజ్యం వేసానన్నారు. పిచ్చిపట్టినట్టు ఏది పడితే అది కులగొడుతాం.... అంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అమరవీరుల స్తూపం కోసం కేవలం టెంకాయ కొట్టాడు చంద్రశేఖర్ రావు, అక్కడ తట్టెడు మట్టి తీయలేదు. భవనాలు కూలుస్తే, ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారకు ఊరుకొమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ భవనాల కూల్చివేత ను అడ్డుకోవడానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇన్ని వేల కోట్లు ప్రజాధనం వృధా చేస్తానంటే ఊరుకొమన్నారు. త్వరలో దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని తెలిపారు.

English summary
Congress fire brand, Malkajigiri MP Revant Reddy has once again ignited Telangana CM Chandrasekhar Rao. He objected to the construction of secretariat and legislative buildings. The Congress party said they had made a visit to the secretariat to inform the public of the real situation. CM Chandrashekhar Rao says that the secretariat buildings will be cleared, but the state has got many needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X