తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారిని కేసీఆర్ ఆంధ్రా దేవుడిగా చూల్లేదు: పరిపూర్ణానందకు రాఘవులు కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరుమల రావడం చాలా సంతోషకరమని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఆంధ్రా దేవుడిగా చూడలేదని సిపిఎం నేత బీవీ రాఘవులు గురువారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరుమల రావడం చాలా సంతోషకరమని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఆంధ్రా దేవుడిగా చూడలేదని సిపిఎం నేత బీవీ రాఘవులు గురువారం అన్నారు.

కేసీఆర్ తిరుమల పర్యటన పైన ఆయన మాట్లాడారు. ఆంధ్రా దేవుడు కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటాడని కేసీఆర్‌కు నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు. వెంకటేశ్వరుడిని ఆంధ్రా దేవుడిగా చూడనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

kcr

కాబట్టి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ దేవుడి వద్దకు రావడం మంచిదని హితవు పలికారు. ఈ రకంగా ఐక్యతను చాటుతుందని చెప్పారు. యాదాద్రికో, భద్రాచలమో చంద్రబాబు వెళ్లి వస్తే బాగుంటుందన్నారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.

తిరుమలకు కేసీఆర్ రూ.5 కోట్ల కానుకలు: విమర్శలపై పరిపూర్ణ జవాబుతిరుమలకు కేసీఆర్ రూ.5 కోట్ల కానుకలు: విమర్శలపై పరిపూర్ణ జవాబు

పరిపూర్ణానందపై ఆగ్రహం

తన పైన విమర్శలు చేసిన స్వామి పరిపూర్ణానంద పైన బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదన్నారు. తిరుమల స్వామి వారికి కేసీఆర్ సమర్పించిన మొక్కులపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

English summary
Left leader BV Raghavulu on Thursday said that Telangana CM KCR is not seeing Srivaru as Andhra god.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X