వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయం అదేనా? ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పేలా గులాబీ బాస్ వ్యూహమా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కుమార్తె కల్వకుంట్ల కవిత విషయంలో ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది . గత ఎన్నికల్లో నిజామాబాద్ నుండి పోటీ చేసి అనూహ్యంగా ఓటమిపాలైన సీఎం కెసిఆర్ కుమార్తె కవిత అప్పటి నుండి పార్టీలో క్రియాశీలకంగా ఉండటం లేదు . ఇక కేసీఆర్ సైతం కవిత విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. చిన్నచిన్న పదవులు ఇవ్వలేక, అత్యంత కీలకమైన బాధ్యత ఏది అప్పజెప్తే బాగుంటుందో అర్థం కాక మల్లగుల్లాలు..

కవిత విషయంలో కేసీఆర్ ముందు రెండు ఆప్షన్లు

కవిత విషయంలో కేసీఆర్ ముందు రెండు ఆప్షన్లు

తాజాగా హుజూర్ నగర్ నుండి కవితను బరిలోకి దించుతారు అని అందరూ భావిస్తే సైదిరెడ్డి కి టికెట్ ఇచ్చి అలాంటిదేమీ లేదని తేల్చేశారు. ఇక హుజూర్ నగర్ నుండి కవితకు టికెట్ ఇస్తారని గెలిస్తే మంత్రిగా చేస్తారని పార్టీ వర్గాల్లో జరిగిన చర్చకు ఫుల్ స్టాప్ పెట్టి సైదిరెడ్డి ని అభ్యర్థిగా ప్రకటించారు గులాబీ బాస్. ఇక కవితను సెటిల్ చెయ్యటానికి కేసీఆర్ ముందు ఉంది రెండే ఆప్షన్లు . అయితే కేసీఆర్ ఏం చేస్తారు అన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో సాగుతుంది.

సైలెంట్ గా ఉన్న కవిత .. మతలబు ఏంటో

సైలెంట్ గా ఉన్న కవిత .. మతలబు ఏంటో

గత ఎన్నికల్లో ఓటమి పాలైన కవిత తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీ వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తెగ హడావిడి చేసిన కవిత ఇప్పుడు ఇంత నైరాశ్యంలో ఉన్నా సీఎం కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో తెలీటం లేదు. ఇక కవిత ఆలోచన ఎలా ఉందో ఎవరికీ అంతు పట్టటం లేదు . గతంలో కవితతో పాటు పార్లమెంట్ లో చక్రం తిప్పిన ఎంపీ వినోద్ కుమార్ కు ప్రణాళిక సంఘం చైర్మన్ గా అవకాశం కల్పించి క్యాబినెట్ హోదా ఇచ్చిన కెసిఆర్, తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ కు తిరిగి మంత్రిగా స్థానం కల్పించారు.

కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే ఆలోచన లేనట్టే

కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే ఆలోచన లేనట్టే

కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టటంతో కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీలో కీలకమైన బాధ్యత అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా కవితకు అవకాశం ఇస్తారన్న చర్చ జోరుగానే జరిగింది. కానీ టిఆర్ఎస్ పార్టీకి తన తర్వాత బాస్ గా కుమారుడు కేటీఆర్ ఉన్నాడని చూపించిన కెసిఆర్ కుమార్తె కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి ఆసక్తి చూపించటంలేదు అన్న చర్చ కూడా టిఆర్ఎస్ పార్టీ నేతల్లో సాగుతోంది.

రాజ్యసభ సభ్యురాలిగా ఛాన్స్ ?

రాజ్యసభ సభ్యురాలిగా ఛాన్స్ ?

చిన్నచిన్న నామినేటెడ్ పదవులు చేయడానికి మాజీ ఎంపీ కవిత సిద్ధంగా లేరు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలలోనూ ఆమెకు టికెట్ ఇవ్వలేదు . అంటే కవితకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇచ్చి ఢిల్లీ రాజకీయాల్లోకి పంపాలని భావిస్తున్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికలకు ముందు వరకు లోక్ సభ సభ్యురాలిగా ఢిల్లీలో చక్రం తిప్పిన కవితను రాజ్య సభ సభ్యురాలిగా పంపాలని భావిస్తున్న కేసీఆర్ ముందు కవిత విషయంలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇదే అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఈ నిర్ణయం కూడా తీసుకోకుంటే కవిత రాజకీయ భవిష్యత్ ఏమిటీ అన్నది ప్రశ్నే .

English summary
CM KCR is also planning to make kavitha as Rajyasabha memeber to play a key role in central politics . Talk now sounds like Kavita is likely to be sent to Delhi politics, There is debate among party lines that this is the best option for a KCR's daughter kavitha to settle down . If this decision is not taken, it is questionable what the future of Kavitha is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X