వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ బాణం లక్ష్యాన్ని ఛేదిస్తుందా..! దక్షిణ రాష్ట్రాల పర్యటన ఫలితం ఇస్తుందా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫలితాల ముందు కేసీఆర్ టూర్లు..! ప్రాంతీయ పార్టీల ఏకాభిప్రాయం కుదిరినట్టేనా..!! || Oneindia Telugu

హైదరాబాద్ : ఓ పక్క దేశ వ్యాప్త ఎన్నికలు.., మరోపక్క తుపాను బీబత్సం.., మరో రెండు వారాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల.., ఇంత ఉత్కంఠ పరిణామల మద్య తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరో రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రశేఖ‌ర్‌రావు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మ‌రోసారి తెర‌మీద‌కు తెచ్చారు. రాష్ట్రంలో ప‌రిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళ‌, పొరుగు రాష్ట్రాల మ‌ద్దతు కోసం ప‌రుగులు పెట్టడం రాజ‌కీయ ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంది. ఇప్పటికే చంద్రశేఖర్ రావు ప‌శ్చిమ‌బెంగాల్‌, క‌ర్ణాట‌క‌, ఒడిషా ముఖ్యమంత్రుల‌తో చ‌ర్చలు జరిపిన చంద్రశేఖర్ రావు తాజాగా కేర‌ళ సీఎం ను క‌లిసేందుకు బ‌య‌ల్దేరారు.

ఫలితాల ముందు కేసీఆర్ టూర్లు..! ప్రాంతీయ పార్టీల ఏకాభిప్రాయం కుదిరినట్టేనా..!!

ఫలితాల ముందు కేసీఆర్ టూర్లు..! ప్రాంతీయ పార్టీల ఏకాభిప్రాయం కుదిరినట్టేనా..!!

ఫలితాల ముందు కేసీఆర్ టూర్లు..! ప్రాంతీయ పార్టీల ఏకాభిప్రాయం కుదిరినట్టేనా..!! ఇప్పటికే ఏపి సీఎం చంద్రబాబు నాయుడు, ఒక్క ఒడిషా సీఎంను మిన‌హా అంద‌రితోనూ ట‌చ్ లో ఉన్నారు. పైగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచార‌ం కూడా చేశారు. మోదీకు ధీటుగా స‌మ‌ర్థుడైన నేత‌గా చంద్రబాబు ఎంపికే స‌రైన‌ద‌నే భావ‌న ప్రాంతీయ పార్టీల్లోకి తీసుకురావ‌టంలో చంద్రబాబు విజ‌య‌వంతం అయ్యారంటూ తెలుగు త‌మ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రశేఖర్ రావు టూర్ నిజంగానే ఉత్కంఠ‌త‌కు దారితీస్తోంది. చంద్రబాబు వైపు తాము ఉన్నామంటూ సంకేతాలు పంపిన నేత‌లు.. చంద్రశేఖర్ రావు మాట‌ల‌తో ఏకీభవిస్తారా అనేది సందేహంగా మారింది. ఎందుకంటే బీజేపిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్న స్థాయిలో చంద్రశేఖర్ రావు వ్యతిరేకించలేక పోవడం, అంతర్గతంగా అవగాహనతో ముందుకు వెళ్లడం కాస్త ఇబ్బందికర పరిణామలుగా చెప్పొచ్చు.

ఓ పక్క బాబు.. మరో పక్క కేసీఆర్..! చెలరేగిపోతున్న సౌత్ నేతలు..!!

ఓ పక్క బాబు.. మరో పక్క కేసీఆర్..! చెలరేగిపోతున్న సౌత్ నేతలు..!!

ఓ పక్క బాబు.. మరో పక్క కేసీఆర్..! చెలరేగిపోతున్న సౌత్ నేతలు..!! అయితే చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్తున్నారు. మ‌మ‌త‌, అఖిలేష్‌, కుమార‌స్వామి, ప‌ట్నాయ‌క్ త‌దిత‌ర నేత‌ల‌కు బీజేపీతో ఎంత వైరం ఉందో.. కాంగ్రెస్‌తోనూ అదే రాజ‌కీయ వైరం కొన‌సాగుతుంది. ఇటువంటి క్లిష్టమైన స‌మ‌యంలో, మే 23 ఫ‌లితాల త‌రువాత‌, బీజేపీ, కాంగ్రెస్‌కు స‌రైన మెజార్టీ రాకుంటే ప్రాంతీయ‌ పార్టీలు గెలుచుకున్న ఎంపీ సీట్లే కీల‌కం కానున్నాయి. ఏపీ, తెలంగాణ‌లో 42 మంది ఎంపీలున్నారు. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. తెలంగాణ‌లో అధిక‌సీట్లు గులాబీపార్టీ సాధిస్తుంద‌నే అంచనా తారా స్థాయిలో ఉంది.

అప్పుడే థర్డ్ ఫ్రంట్ సత్తా తెలుస్తుందంటున్న కేసీఆర్..!!

అప్పుడే థర్డ్ ఫ్రంట్ సత్తా తెలుస్తుందంటున్న కేసీఆర్..!!

ఎంపీల బలం కావాలి..! అప్పుడే థర్డ్ ఫ్రంట్ సత్తా తెలుస్తుందంటున్న కేసీఆర్..!! కాబ‌ట్టి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ ఎంపీ సీట్లున్న నేత‌లు వారికి కావాల్సి ఉంటుంది. అందుకోసం ప్రాంతీయ పార్టీల్లో బలమైన నేతలు ఏకమైతే ఫెడరల్ ఫ్రంట్ మరింత బలీయంగా ముందుకు వెళ్తుందనేది చంద్రశేఖర్ రావు వ్యూహంగా తెలుస్తోంది. ఫలితాల ముందు చంద్రశేఖర్ రావు పర్యటన ఎలా ఉన్నా, రేపు ఫలితాల తర్వాత దీని ప్రభావం ఎక్కువాగా ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అందులోనూ చంద్రశేఖర్ రావు దక్షిణ రాష్ట్రాల పర్యటన కూడా వ్యూహాత్మకమనే ప్రచారం కూడా జరుగుతోంది.

 ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా ఉండాలంటున్న గులాబీ బాస్..! కేసీఆర్ తో జతకట్టేంది ఎంతమంది..?

ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా ఉండాలంటున్న గులాబీ బాస్..! కేసీఆర్ తో జతకట్టేంది ఎంతమంది..?

అదే స‌మ‌యంలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా ఏదైనా జరగొచ్చనే విశ్లేషణ కూడా నడుస్తోంది. ఏపిలో వైసీపికి అనుకున్నంత మంది ఎంపీలు గెలవకపోతే చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఓ ఆప్షన్ ను చంద్రశేఖర్ రావు పక్కన పెట్టుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఒక బాబు పడవ ప్రయాణం తేడా వస్తే చంద్రశేఖర్ రావు స‌న్నిహితుడు జ‌గ‌న్ నుంచి కూడా మ‌ద్దతు పొంద‌వ‌చ్చనేది అవ‌త‌లి వైపున ఉన్న బీజేపీ, కాంగ్రేసేత‌ర పార్టీల ఆలోచ‌న కావ‌చ్చనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ముందుచూపులో భాగంగానే చంద్రశేఖర్ రావు తో స్నేహానికి మొగ్గుచూపుతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రశేఖర్ రావు థర్డ్ ఫ్రంట్ అంశంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

English summary
On the other hand, the country's wide-ranging polls, the storm surge, the election results in another two weeks.. Telangana Chief Minister Chandrashekhar Rao, federal front was once again brought to the screen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X