ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోటి ఎకరాలకు నీళ్లిచ్చేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు: కేసీఆర్

తెలంగాణ వస్తే ఏమవుతుందని అడిగినవారు.. దీన్ని చూసి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని కేసీఆర్ గ్రహించాలన్నారు.

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభించిన సందర్బంలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లిచ్చేవరకు విశ్రమించేది లేదని శపథం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ఆ పార్టీని తన వ్యాఖ్యలతో కడిగిపారేశారు.

కాగా, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిబద్దత, కృషి వల్లే ప్రాజెక్టు త్వరతిగతిన పూర్తయిందన్నారు.
దాదాపు 60వేల ఎకరాలకు లిఫ్టు ద్వారా నీళ్లందించే ఈ ప్రాజెక్టు నిర్ణీత గడువు కన్నా ముందే పూర్తయిన విషయాన్ని ఈ సందర్బంగా కేసీఆర్ గుర్తుచేశారు.

తెలంగాణ వస్తే ఏమవుతుందని అడిగినవారు.. దీన్ని చూసి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని గ్రహించాలన్నారు. తెలంగాణ సాధించుకున్న చిత్తశుద్దితోనే ప్రాజెక్టులు కూడా పూర్తిచేస్తామని అన్నారు.

ఇక ప్రాజెక్టులపై కోర్టుకెక్కుతున్న కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ.. ఆ పార్టీ ముఠాలను తయారుచేస్తోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రాజెక్టులపై మన రాష్ట్ర నేతలే పిటిషన్స్ వేస్తున్నారని మండిపడ్డారు.

రూ.35వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛను అందజేస్తున్నామని, సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యంతో ఆహారం పెడుతున్నామని.. ఇలా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి కేసీఆర్ ప్రజలకు వివరించారు.

 KCR Launched Bhakta Ramadas project in Khammam

తమ 40ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఎన్నడైనా బీడీ కార్మికుల గురించి ఆలోచించిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దళిత, బీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.20లక్షలు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ది అని గుర్తుచేశారు. దేశం మొత్తం మీద ఎక్కడా లేనివిధంగా ఆటోరిక్షాలకు సైతం పన్ను మాఫీ చేసిన ప్రభుత్వం తమదని కేసీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ గత పాలనను దుయ్యబడుతూ.. కేవలం ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుని వారంతా కాలం వెళ్లదీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో కేంద్రం నుంచి 2700కిమీ మేర జాతీయ రహదారులను సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. ఈ విషయాలేవి కాంగ్రెస్ వాళ్లకు కనిపించట్లేదా? అని నిలదీశారు.

ఇక ఇదే సభా వేదికపై పద్మశ్రీ అవార్డు పొందిన వణజీవి రామయ్య దంపతులను కేసీఆర్ సన్మానించారు. అలాగే ప్రాజెక్టును పూర్తి చేసిన గుత్తేదారు మెగా కృష్ణారెడ్డిని కూడా సన్మానించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్ముల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

English summary
Telangana CM KCR launched Bhakta Ramadas Project in Khammam on Tuesday. He criticised Congress party on their failures
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X