వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘‘దేశంలో కేసీఆర్ ఒక్కరే.. ఖలేజా ఉన్న సీఎం..’’

దేశంలో ఖలేజా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని విశాఖ శారదా పీఠాధిపతి.. స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో ఖలేజా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని విశాఖ శారదా పీఠాధిపతి.. స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా నవంబర్ 5న హన్మకొండ వేయిస్తంభాల గుడిలో 'రుద్రేశ్వరుడి లక్ష బిల్వార్చన' జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రసంశలు కురిపించారు. ఏ ముఖ్యమంత్రీ చేయనివిధంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల కోసం కేసీఆర్.. ఆయుత చండీయాగం చేసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారంటూ కొనియాడారు.

KCR, leader with guts, says Swamy Swaroopanandendra Saraswati

'అనేక మంది సీఎంలు.. పూజా కార్యక్రమాల్లో బొట్టు పెట్టుకొని తర్వాత తుడిచేసుకున్నంత తేలికగా ఇచ్చిన మాటలను విస్మరిస్తారు. కానీ, కేసీఆర్ ఒక్కరే తక్కువగా మాట్లాడి.. గట్టి కార్యాచరణ చేస్తారు..' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

అంతేకాదు, బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు, రూ.200 కోట్లు కేటాయించి వైదిక సంప్రదాయాలను పరిరక్షిస్తున్న సీఎం దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్వామీజీ కొనియాడారు. పనిలో పనిగా.. పురావస్తు శాఖ తీరుపై కూడా స్వరూపానందేంద్ర మండిపడ్డారు. వేయి స్తంభాల గుడి కల్యాణ మంటప నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి.. తొమ్మిదేళ్లయినా పూర్తి చేయలేదని, ఆ శాఖ పనితీరుకు ఇదే నిదర్శమని దుయ్యబట్టారు.

'అదొక దిక్కుమాలిన సంస్థ, ఆ సంస్థకు భక్తి ఉండదు.. ఏమీ ఉండదు. పవిత్ర ప్రాంతాలకు చెప్పులతో వెళతారు. స్థల ప్రాశస్థ్యం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు..' అంటూ పురావస్తు శాఖ అధికారులపై ఆయన మండిపడ్డారు.

కాకతీయుల కట్టడాలను, దేవాలయాలను పురావస్తు శాఖ పరిధి నుంచి తప్పించి రాష్ట్ర పరిధిలోకి తేవాలని, ఇందుకు సీఎం కేసీఆర్ పూనుకోవాలని స్వరూపానందేంద్ర కోరారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కట్టడాల ప్రాశస్థ్యాన్ని పునరుజ్జీవింప చేయాలని కోరారు.

వేయిస్తంభాల గుడిలో పరమశివుడికి అభిషేకం చేస్తుంటే.. సాక్షాత్తు ఆ శివపార్వతులే వచ్చి స్వీకరించారా..? అన్నంత అనుభూతి కలిగిందంటూ.. తెలంగాణలో వేలాది దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమాన్ని స్వామీజీ అభినందించారు.
స్వరూపానందేంద్ర అన్నారు.

English summary
There is no doubt that CM KCR is an unmatched and unparalleled leader. This was the opinion expressed by spiritual leader and head of Visakha Sri Sarada Peetham Swami Swaroopanandendra Saraswati. The seer made the comment in the context of criticism in some circles over the Ayuta Chandi Yagam performed recently by Chief Minister K Chandrasekhar Rao. The Chief Minister has performed this yagam in the larger interests of the people of Telangana. He didn’t confine himself to Hindu community. His desire is that Telangana State and population should get benefits from the Ayuta Chandi Yagam performed by him. As a ruler, he is not confined to one particular community or dharma. As an individual too, the Chief Minister has proved himself time and again that he has respect for all religions and beliefs. One thing I wish to underscore is that he has performed this yagam for the welfare of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X