వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కొత్త అడుగులు: పదవుల కోసం కాదు... థర్డ్ ఫ్రంట్‌పై ఎంపీ కవిత ఇలా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు దిశగా చొరవ తీసుకుంటానని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. సోమవారం ఆయన కోల్‌కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. దీనిపై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

మార్పు దిశగా దేశాన్ని నడిపించేందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పారని ఆమె అన్నారు. ఇప్పటి దాకా వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలను పట్టించుకోలేదన్నారు. వాళ్ల అవసరాలు తీర్చుతూ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసమే ఫెడరల్ ఫ్రంట్ అన్నారు.

కేసీఆర్ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని, తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశమంతా అమలు చేయాలన్నదే ఆయన లక్ష్యమని, డెబ్బై ఏళ్లలో దేశంలో జరగని అభివృద్ధిని తెలంగాణలో మూడేళ్లలో సాధించామని కవిత అన్నారు. ఈ ఫలాలు దేశమంతా అందాలన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrashekar Rao is likely to fly down to Kolkata on Monday to meet his counterpart Mamata Banerjee to discuss the possibility of forming a “non-Congress, non-BJP” political front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X