హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడే తెలంగాణ కేబినెట్ విస్తరణ, ఆ తర్వాత శాసన సభ ప్రత్యేక సమావేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సంక్రాంతి పండుగ తర్వాత చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారని తెలుస్తోంది. అప్పుడే శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడంతోపాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరపనున్నట్లు తెలుస్తోంది.

పలువురు ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శి పదవులు ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ, శాసనసభ సమావేశంపై ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

సంక్రాంతి వరకు పీడదినాలు

సంక్రాంతి వరకు పీడదినాలు

కేబినెట్ విస్తరణ కోసం ముందు కొన్ని తేదీలను పరిశీలించినా సంక్రాంతి వరకు పీడదినాలు ఉండడం, పాలనాపరమైన ప్రక్రియలు, సానుకూలతలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని అధికారిక కార్యక్రమాలను అన్నింటిని పండుగ తర్వాతే నిర్వహించాలని కేసీఆర్ అనుకుంటున్నారని తెలుస్తోంది.

 పార్లమెంటు ఎన్నికల తర్వాత కేబినెట్ పూర్తి విస్తరణ

పార్లమెంటు ఎన్నికల తర్వాత కేబినెట్ పూర్తి విస్తరణ

పీడదినాల తర్వాతే అసెంబ్లీని సమావేశపరిచి, సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారని సమాచారం. కేబినెట్‌ను కూడా రెండు దశల్లో విస్తరించనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి పీడదినాలు పూర్తయ్యాక కొందరిని కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో విస్తరించాలని ఆలోచిస్తున్నారని సమాచారం.

ఏకరీతిన ఉన్న శాఖలను ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోకి

ఏకరీతిన ఉన్న శాఖలను ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోకి

ఏకరీతిన ఉన్న పలు శాఖలను ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకు రావాలని కేసీఆర్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తు కూడా చేస్తున్నారు. ఏ శాఖను ఎవరికి అప్పగించాలనే విషయంపై కూడా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాలని కూడా భావిస్తున్నారని సమాచారం. వారి నియామకం కోసం అవసరమైతే చట్టం కూడా తీసుకొచ్చే అవకాశముంది.

పార్లమెంటరీ కార్యదర్శులుగా

పార్లమెంటరీ కార్యదర్శులుగా

పార్లమెంటరీ కార్యదర్శులుగా ఎంతమందిని నియమించాలనే అంశంపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నారని తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఒకేసారి ఆయా నియామకాలు, ఎన్నికలు జరపాలని కేసీఆర్ నిర్ణయిస్తున్నారని తెలుస్తోంది.

English summary
The party president and chief minister is keeping everyone guessing as he roped in only one MLA, Mohammad Mahmud Ali, in his cabinet and has made no announcement about his next move. He may announce cabinet after sankranthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X