వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌తో భేటీ: 23 నుంచి అసెంబ్లీ, రైతు ఆత్మహత్యలపై ఏం చెప్తారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను సోమవారం సాయంత్రం కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై కత్తులు నూరడానికి సిద్ధమవుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసినా చెప్పినా అవి ఆగడం లేదు.

నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరణించిన రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని లక్షన్నర నుంచి ఆరు లక్షల రూపాయలకు పెంచింది. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఆదివారం నాడు 13 మంది మరణించారు.

 KCR meets governor: assembly begins from september 23

రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో శాసనసభలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఒక్కటై ప్రభుత్వంపై విమర్సనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అయితే, రైతు ఆత్మహత్యలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి టి. హరీష్ రావు అన్నారు.

రైతు ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. సమావేశాలను కూడా ప్రతిపక్షాలు అడిగినన్ని రోజులు నిర్వహిస్తామని ఆయన అంటున్నారు. ప్రతిపక్షాలు రైతు ఆత్మహత్యలు చేసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు వాటిపై ఎదురుదాడికి దిగుతోంది.

గత కాంగ్రెసు పాపాల కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అదే సమయంలో రైతుల ఆత్మహత్యలను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాల నేతలను కోరుతున్నారు. ఏమైనా, రైతుల ఆత్మహత్యలపై వచ్చే తెలంగాణ శాసనసభా సమావేశాలు అట్టుడికే అవకాశం ఉంది.

English summary
Telangana CM K Chandrasekhar Rao met governor Narasimhan at Rajabhavan in wake of assembly session going to be start from september 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X