వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేడుకలకు రండి: గవర్నర్‌తో కెసిఆర్, కళాకారులు, పోలీస్ రిహార్సల్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్‌తో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్.. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అధికారికంగా అహ్వానించారు. వీరి భేటీ దాదాపుగా రెండున్నర గంటలపాటు సాగింది.

ద్వితీయ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న కార్యక్రమాలను గవర్నర్‌కు కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. వివిధ రంగాల ప్రముఖులకు ఇవ్వనున్న అవార్డులు, అమరవీరుల స్మారక కేంద్రం, అతి పెద్ద జాతీయ జెండాలాంటి వాటితో పాటుగా వాడవాడలా కార్యక్రమాలను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

జిల్లాకు రూ.30లక్షలు విడుదల చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారని సమాచారం. వీటితోపాటు రాష్ట్ర ప్రజల కలలు సాకరమయ్యే విధంగా నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చెప్తున్న అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వ వాదనను వివరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

కెసిఆర్ ఆహ్వానం

కెసిఆర్ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్‌తో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్.. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అధికారికంగా అహ్వానించారు.

కెసిఆర్ ఆహ్వానం

కెసిఆర్ ఆహ్వానం

ద్వితీయ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న కార్యక్రమాలను గవర్నర్‌కు కేసీఆర్ వివరించినట్టు తెలిసింది.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

స్వరాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కళాకారులు సన్నద్ధమవుతున్నారు. అద్భుత ప్రదర్శనలివ్వడం కోసం లలిత కళా తోరణంలో సాధన చేస్తున్నారు.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

తెలంగాణ పోరాట ఘట్టాలను, అమరుల త్యాగాలను, బంగారు తెలంగాణ లక్ష్యాలను, కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వివరిస్తూ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారుల ఆటలు, పాటలు జోరుగా సాగుతున్నాయి.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

పీపుల్స్ ప్లాజాతోపాటు హెచ్‌ఐసీసీలో జరిగే ప్రదర్శనల కోసం ప్రత్యేకంగా పాటలు రాయించినట్లు సాంస్కృతిక సారథి కవుల కన్వీనర్ యశ్‌పాల్ తెలిపారు.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

ఇందుకోసం 15మంది కవులతో వారంరోజులపాటు లలిత కళాతోరణంలో ప్రత్యేకంగా క్యాంప్ నిర్వహించామన్నారు.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్‌తోపాటు పేదల సంక్షేమానికి తోడ్పడుతున్న పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, సన్నబియ్యం పథకాలను ఒగ్గుకథ గానంతో వివరించనున్నారు.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

జై బోలో తెలంగాణ పాటను సారథి సభ్యులే రాసి, స్వరకల్పన చేసి ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తున్నారు.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

యువతకు ఆకట్టుకునేట్టు ఉన్న ఈ పాటతోపాటు నేడే నేడే స్వేచ్ఛాగీతం పాడిన రోజు.. తెలంగాణ మురిసిన రోజు.. గుండె గుండెలో విజయ కేతనం ఎగరేసిన పండుగ రోజు వంటి ఉత్సాహవంతమైన పాటలతో సాధన చేస్తున్నారు.

కళాకారుల రిహార్సల్స్

కళాకారుల రిహార్సల్స్

అమరుల త్యాగాల్ని స్మరిస్తూ ఈ రోజే నలిగిన గుండెలకు కొత్త ఊపిరి.. జై బోలో తెలంగాణ నినాదమై మా నరనరాన అంటూ సాగే కరీంనగర్ కవి తిరుపతి రాసిన పాటకు కళాకారులు స్టెప్పులు జోడించి కొత్త ప్రయోగం చేస్తున్నారు. వీటితోపాటు లంబాడాల పాటకు దాండియా శైలి నృత్యంతో అలరించేందుకు కళాకారులు సిద్ధమవుతున్నారు.

పోలీసుల రిహార్సల్స్

పోలీసుల రిహార్సల్స్

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నగరం ముస్తాబవుతోంది.

పోలీసుల రిహార్సల్స్

పోలీసుల రిహార్సల్స్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ బెటాలియన్ రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి.

పోలీసుల రిహార్సల్స్

పోలీసుల రిహార్సల్స్

సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ పతాకం ఎగరవేయడానికి పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి.

పోలీసుల రిహార్సల్స్

పోలీసుల రిహార్సల్స్



జల దృశ్యంలో నూతనంగా నిర్మించనున్న అమరుల స్థూపానికి సీఎం కేసీఆర్ జూన్ 2న భూమి పూజ చేయనున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు.

పోలీసుల రిహార్సల్స్

పోలీసుల రిహార్సల్స్

గన్‌పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

English summary
Ahead of the Telangana Formation Day celebrations on June 2, Chief Minister K Chandrashekar Rao called on Governor ESL Narasimhan at Raj Bhavan here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X