జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించా, కానీ: కేసీఆర్, నయీం పైనా స్పందన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలాల కమిటీలో తాను సభ్యుడిని అని, తొలుత ఆ విధానాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ... మండలాల ఏర్పాటు విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు పైన కేసీఆర్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలతో వేర్వేరుగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ మండలాలు విజయమైనట్లే..

ఎన్టీఆర్ మండలాలు విజయమైనట్లే..

మండలాల ఏర్పాటు విజయవంతమైనట్లే ఇప్పుడు కొత్త జిల్లాలు మంచి ఫలితాలిస్తాయన్నారు. కొత్త జిల్లాలు దసరా పండగ నుంచే ప్రారంభం కావాలని కేసీఆర్ సమీక్ష సమావేశంలో ఆదేశించారు. శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి పేరు పెడతామని, గండీడ్ మండలాన్ని మహబూబ్ నగర్‌లో చేర్చుతామని, ఆందోల్ నియోజకవర్గంలో వట్టిపల్లి మండల ఏర్పాటును పరిశీలిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో కొత్తగా నేరేడుకొమ్ము, మల్లారెడ్డి గూడెంలు ఉండబోతున్నాయని, సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మండలం ఏర్పాటుపై పరిశీలిస్తామన్నారు.

అప్పుడే జిల్లాల గురించి చర్చించాం

అప్పుడే జిల్లాల గురించి చర్చించాం

తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రొఫెసర్ జయశంకర్, ఆర్ విద్యాసాగర్ రావు సమక్షంలో జిల్లాల విభజనపై చర్చ జరిగిందని కేసీఆర్ ఈ సమావేశంలో అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చెరువుల పునరుద్ధరణ, జిల్లాల విభజన అత్యంత శాస్త్రీయంగా జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

రాజకీయ కారణాలు వద్దు

రాజకీయ కారణాలు వద్దు

జిల్లాల విభజన అనేది రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలతో జరగకూడదన్నారు. ప్రజాభీష్టం మేరకే జరగాలన్నారు. జిల్లాల విభజనలో ప్రజాభీష్టం మేరకు మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముసాయిదాలో రూపొందించిన జిల్లాలు, డివిజన్లు, మండలాల కంటే ఎక్కువ మొత్తంలో పాలనా విభాగాలు అవసరమనుకుంటే వాటి సంఖ్యను పెంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

నయీంను పెంచి పోషించిన వారి మాటేమిటి

నయీంను పెంచి పోషించిన వారి మాటేమిటి

గ్యాంగ్‌స్టర్ నయీం ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి పెదవి విప్పారు. నయీం విషయంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా మాట్లాడని సీఎం ఆదివారం ఆయన పేరును ప్రస్తావించారు. టీఆర్ఎస్ నాయకులతో నయీంకు సంబంధాలు ఉన్నాయని అందరూ అంటున్నారని, మరి నయీంను పెంచి పోషించిన వారి సంగతేమిటని ప్రశ్నించారని తెలుస్తోంది.

కేసీఆర్

కేసీఆర్


నల్గొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో నయీం అంశం చర్చకు వచ్చింది. నయీంతో ఒక్క తెరాస నాయకులకే సంబంధాలు ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, మరి నయీంను పెంచి పోషించిన వారి సంగతేమిటని, వాళ్లు ఎటు వెళ్లాలని ప్రశ్నించారని సమాచారం.

English summary
KCR meets party leaders on new districts, Mentioned Sr NTR name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X