వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో బీజేపీ గెలవకుంటే కష్టమయ్యేది: కేసీఆర్

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ ముఖ్య నేతలతో శనివారం ఆయన సమా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ ముఖ్య నేతలతో శనివారం ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం వల్ల తెలంగాణలో తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అంశాల వారీగా మద్దతిస్తున్నామని చెప్పినట్లు తెలిసింది.

KCR on UP elections results and bjp win

అంతేగాక, కీలక రాష్ట్రాల్లో గెలుపొందడం బీజేపీకి కచ్చితంగా పెద్ద విజయమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయుంటే ఆర్థిక సంస్కరణల్లో దేశం వెనకబడేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

2024వరకూ ఆశలొద్దు: మోడీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలనం, తొలి గెలుపు బీజేపీదే2024వరకూ ఆశలొద్దు: మోడీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలనం, తొలి గెలుపు బీజేపీదే

అంతేగాక, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఈ విజయంతో దేశాభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి 310 సీట్లకు పైగా సీట్లను సాధించింది. ఉత్తరాఖండ్‌లోనూ మేజిక్ ఫిగర్‌ను దాటేసి ప్రభుత్వాన్నిఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సాగుతోంది. ఈ రెండు ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్‌ను దక్కించుకోలేదు. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ అందించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Saturday responded on Uttar Pradesh elections results and winning of BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X