వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ చేతుల మీదుగా గృహప్రవేశాలు: ఎర్రవల్లిలో పండుగ వాతావరణం..

నేటి ఉదయం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్చరణల సామూహిక గృహప్రవేశాలు జరిగాయి.

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట: సొంతిళ్లు కట్టుకోవాలనేది ప్రతీ సామాన్యుడి కల. గత ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పుడు సామాన్యుడి కలను సాకారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్చరణల సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 7.53గం.లకు ఇరు గ్రామాల్లోని ప్రజలంతా గృహప్రవేశం చేశారు. దీంతో ఎర్రవల్లి, నర్సన్నపేటలో పండుగ వాతావరణం నెలకొంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ద్వారా ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 159 కుటుంబాలు లబ్ది పొందాయి.ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. అంతకుముందు వేదపండితులంతా పూర్ణకుంభంతో కేసీఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన పైలాన్ ను కేసీఆర్ ఆవిష్కరించారు.

KCR opens double bedroom houses; declares Erravalli, Narsannapet as cashless transaction villages

సీఎం ప్రత్యేక శ్రద్ద వహించడంతో..గతేడాది విజయదశమి నాడు ప్రారంభించిన డబుల్ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయింది. సకల సౌకర్యాలతో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకతలు:

- దేశంలోనే ప్రప్రథమంగా రెండు గ్రామాల పరిధిలో 600 పేద కుటుంబాలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు.
- ఒక్కొక్క ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు
- వెయ్యి మందికి సరిపడా కల్యాణ మండపం, భోజనశాల నిర్మాణం. ప్రతి కుటుంబ అభ్యున్నతికి రెండు గేదెలు, పది దేశీయ కోళ్ల పంపిణీ.
- హరితహారం కింద ప్రతి ఇంటికి ఐదు మొక్కల పంపిణీ. పచ్చదనం శోభతో వెల్లివిరిసేలా రహదారులకు ఇరువైపులా మొక్కలు.
- జలసంరక్షణ కోసం ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం. అందుబాటులో ఇంటర్నెట్ సేవలు
- రెండు గ్రామాల రైతులు స్ఫూర్తిమంతంగా 2800 ఎకరాల్లో సామూహిక పంట సాగు. విత్తనోత్పత్తి కింద సోయాబిన్ అధిక దిగుబడి.
- సమీకృత బిందు సేద్యం కింద 2 గ్రామాల్లో నెటాఫిమ్ కంపెనీ ద్వారా 2800 ఎకరాల్లో 1400 మంది రైతులకు పరికరాలు అమర్చుట.
- మిషన్ కాకతీయ కింద ప్రత్యేక ప్రణాళికతో ఈ రెండు గ్రామాల్లో ఐదు చెరువులు, కుడ్లేరు వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణంతో సమృద్ధిగా నీటి నిల్వకు అవకాశం.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao has inaugurated double bedroom houses in Erravalli and Narsannapet villages in Jagdevpur mandal of Medak district. He also inaugurated a community hall at Erravalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X