• search
 • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మామ ఇలాకాలో అల్లుడు గారు.. కేసీఆర్ డైరెక్షన్.. హరీష్ రావు యాక్షన్..!

|
  చింతమడకలో ఆరోగ్యశిబిరాన్ని ప్రారంభించిన హరీష్ రావు || Harish Rao Started Health Camp In Chintamadaka

  సిద్ధిపేట : మామకు తగ్గ అల్లుడు. మామ చెప్పిందే ఆయనకు వేదం. మామ బాటలో నడుస్తూ.. మామను అనుసరిస్తూ.. మామ కోసం ఏమైనా చేస్తారు. అంతలా మామంటే మమకారం, అభిమానం. మామకు వెన్నంటివుంటూ.. మామ ఆలోచనల్లో పాలుపంచుకుంటూ.. మామకు దీటుగా ఎదిగిన అల్లుడిగా పేరు గడించారు. మామ తర్వాత అంతటి స్థానం కూడా ఆయనదే అన్నట్లుగా రాజకీయ ఎత్తుగడల్లో కూడా ముందుంటారు. ఇంతకు ఆ మామ టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐతే.. అల్లుడేమో మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.

  మామ అల్లుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రస్థానంలో కేసీఆర్‌కు చేదోడువాదోడుగా ఉంటూ మామకు దీటైన అల్లుడిగా ముద్రపడ్డారు హరీష్ రావు. ఏ కార్యం తలపెట్టినా మామది డైరెక్షన్ ఐతే.. క్షేత్రస్థాయిలో స్టార్ట్, యాక్షన్ అంటూ చక్కబెట్టేది మాత్రం అల్లుడే. తాజాగా కేసీఆర్ సొంతూరు చింతమడకకు వరాల జల్లు కురిపించిన నేపథ్యంలో హరీష్ రావు ఆ గ్రామాభివృద్దిపై దృష్టి పెట్టడం చర్చానీయాంశమైంది.

  మామ ఊరిలో అల్లుడు గారు

  మామ ఊరిలో అల్లుడు గారు

  సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకలో ఇంటింటికీ పది లక్షల రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి కుటుంబం బాగుపడి గ్రామాభివృద్ధి వికసించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆ క్రమంలో ఇటీవల చింతమడక పర్యటనకు వెళ్లిన కేసీఆర్ సొంతూరుకు వరాల జల్లు కురిపించారు. అంతేకాదు చింతమడక నుంచి మొదలుపెట్టనున్న ఆరోగ్య సూచిక ఆదర్శంగా నిలవాలని సూచించారు.

  సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆసుపత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. చింతమడక నుంచి ప్రారంభిస్తున్న ఆరోగ్య సూచిక దేశానికి ఆదర్శప్రాయం కావాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతోనే గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ప్రతి రోజూ 500 మందికి ఆరోగ్య పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

  గవర్నర్ నరసింహన్ బదిలీ.. జమ్ముకశ్మీర్‌కేనా స్థాన చలనం..!

  దేశానికి ఆదర్శం కావాలి.. హరీష్ ఆకాంక్ష

  దేశానికి ఆదర్శం కావాలి.. హరీష్ ఆకాంక్ష

  అదలావుంటే చింతమడకలో ప్రారంభించిన ఆరోగ్య సూచిక త్వరలో రాష్ట్రమంతటా జరుగుతుందని చెప్పుకొచ్చారు హరీష్ రావు. ఈ శిబిరంలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి అన్ని రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాగానే ఆరోగ్య సూచిక కూడా దేశంలో ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ మహిళలు గానీ, పురుషులు గానీ, క్యాన్సర్, గుండె జబ్బు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

  ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎవరికైనా ఎమర్జెన్సీ సర్జరీలు అవసరముంటే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే త్వరలోనే కంటి వ్యాధులకు, దంతాలకు సంబంధించి ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య సూచిక సిద్దిపేట నియోజకవర్గం చింతమడక నుంచే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

  మామ వ్యూహాలకు అల్లుడి మంత్రాంగం

  మామ వ్యూహాలకు అల్లుడి మంత్రాంగం

  ఎన్నికలైనా, ఇతర పార్టీ కార్యక్రమాలైనా కేసీఆర్ చెబితే చాలు.. అలా అల్లుకుపోతారు హరీష్ రావు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ కట్టబెట్టారు. మామ వ్యూహాలకు తగ్గట్టుగా ఆయన నడుచుకుంటారనే పేరుంది. ఆ క్రమంలో మామ చెప్పిందే వేదంలా భావించి క్షేత్రస్థాయిలో సక్సెస్ అవుతారనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట.

  అదే క్రమంలో సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడక నుంచి నాంది పలికిన ఆరోగ్య సూచికను కూడా హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు.. చింతమడక తన పరిధిలోకి రావడంతో మరింత దృష్టి సారించారు. కేసీఆర్ సొంతూరులో ఆరోగ్య సూచిక శిబిరానికి సంబంధించి హరీష్ రావు యాక్టివ్‌గా వ్యవహరించడంతో.. మామ ఊరిలో అల్లుడు అనే కామెంట్లు వినిపిస్తుండటం చర్చానీయాంశమైంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana CM KCR son in law Harish Rao follows his uncle since from telangana movement to till date. He works absolutely under KCR direction. Now, He focused on KCR's own village Chintamadaka as AROGYA SUCHIKA started as per Uncle's Direction.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more