హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు తారలు జై!: చెట్టుకు నీళ్లు పోసిన కేసీఆర్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో సోమవారం నాడు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, సినీ తారలు చిరంజీవి, అల్లు అర్జున్, మంచు లక్ష్మీ, నాగార్జున, అమల తదితరులు మొక్కలు నాటారు.

మంత్రి హరీష్ రావు.. బీహెచ్ఈఎల్‌లో నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణను ఆకుపచ్చగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారన్నరు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే హరితహారం చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారన్నారు.

తెలంగాణ జాతి అంటేనే పట్టుదలకు మారు పేరు అని, అదే స్ఫూర్తితో హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను నాటి. వాటిని పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనషుల జీవితాలు చెట్లతో ముడిపడి ఉంటాయన్నారు.

అందుకే చెట్లను ప్రతి ఒక్కరూ సంరక్షించాలన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, కానీ మెదక్‌లో మాత్రం అటువంటి పరిస్థితి లేదని గుర్తు చేశారు. అందుకు చెట్లు లేకపోవడమే కారణమన్నారు.

కేసీఆర్

కేసీఆర్

కోట్లాది మొక్కలను నాటి తెలంగాణను పచ్చని తీవాచీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ కూడా హరితహారంలో పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

నగరంలోని నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వేప మొక్క, కదంబ మొక్కను నాటారు. మొక్కలకు నీళ్లు పోశారు.

కేసీఆర్

కేసీఆర్

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితోపాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హరితహారాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా భావించొద్దని, అందరూ తమ ఇంటి కార్యక్రమంలా భావించి లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. తెలంగాణను పచ్చన వనంగా మార్చుదామని ఆయన పిలుపునిచ్చారు.

కేసీఆర్

కేసీఆర్

కోట్లాది మొక్కలను నాటి తెలంగాణను పచ్చని తీవాచీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ కూడా హరితహారంలో పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

నగరంలోని నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వేప మొక్క, కదంబ మొక్కను నాటారు. మొక్కలకు నీళ్లు పోశారు.

కేసీఆర్

కేసీఆర్

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితోపాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హరితహారాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా భావించొద్దని, అందరూ తమ ఇంటి కార్యక్రమంలా భావించి లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. తెలంగాణను పచ్చన వనంగా మార్చుదామని ఆయన పిలుపునిచ్చారు.

హరితహారం

హరితహారం

హరితహారం ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

హరితహారం

హరితహారం

మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద మూడో ప్రయత్నమన్నారు. చైనా, ఆఫ్రికా తర్వాత భారీ స్థాయిలో హరితహారం చేపట్టడం తెలంగాణలోనే అన్నారు.

హరితహారం

హరితహారం

రాష్ట్రంలో ఉన్న 24 శాతం అటవీ విస్తీర్ణాన్ని 33 శాతంకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెట్టడం కాదు.. వాటిని పరిరక్షించడం కూడా ముఖ్యమన్నారు.

హరితహారం

హరితహారం

భవిష్యత్‌లో మొక్కలు పెడితేనే ఇల్లు, పరిశ్రమలకు అనుమతిస్తామనే ప్రతిపాదన తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి.

 హరితహారం

హరితహారం

దుష్ఫలితాలు ఏర్పడకూడదంటే మొక్కలను నాటి పెంచాలని చెప్పారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దని కోరారు. ప్రజలందరూ తమ ఇంటి కార్యంగా భావించి హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు హరితమైన తెలంగాణను అందించాలన్నారు.

హరితహారం

హరితహారం

గవర్నర్ నరసింహన్ కూడా హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటే బాధ్యత ప్రభుత్వానిదే కాదన్నారు. గత ఏడాది నాటిన మొక్కల్లో 52 శాతం పెరిగాయన్నారు.

హరితహారం

హరితహారం

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పాలు పంచుకున్నారు.

హరితహారం

హరితహారం

చిరంజీవి, నాగార్జున, అమల, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి, మంచులక్ష్మి, రెజీనా తదితరులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

హరితహారం

హరితహారం

నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటినట్లు తెలుపుతూ ట్విట్టర్‌ ద్వారా ఫొటోలను పంచుకున్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తామని ప్రమాణం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

 హరితహారం

హరితహారం

నాగార్జున సతీమణి అమల కూకట్‌పల్లిలో తన అభిమానులతో కలిసి హరితహారంలో పాల్గొన్నట్లు తెలిపారు. రానా దగ్గుబాటి నానక్‌రామ్‌గూడలో మొక్కలు నాటినట్లు తెలుపుతూ.. ట్విట్టర్‌లో ఫొటోలను పోస్ట్‌ చేశారు.

 హరితహారం

హరితహారం

మంచులక్ష్మి తన సహనటులతో కలిసి మొక్కలు నాటినట్లు ట్వీట్‌ చేశారు. రెజీనా కూడా సోషల్ మీడియా ద్వారా హరితహారంలో పాల్గొన్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. చిరంజీవి, అల్లు అర్జున్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

English summary
KCR participates in Haritha Haram programme at NIMS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X