వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకూ.. నా కుటుంబ స‌భ్యుల‌కు ఏం జ‌రిగినా కేసీఆర్, డీజీపీల‌దే బాద్య‌త‌..! రేవంత్ రెడ్డి.

|
Google Oneindia TeluguNews

ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రి అనైతిక కార్య‌క్ర‌మాల‌కు పోలీసుల అండ‌..! రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌..!
తెలంగాణాలో నిరంకుశ పాల‌న కొన‌సాగుతోంద‌ని, కేసీఆర్ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసిఆర్, కెటీఆర్ లు ప్రభుత్వ రద్దుకు ముందే అధికారికంగా కొన్ని సార్లు, రహస్యంగా కొన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వారి సొంత ప్రయోజనాల కోసం పర్యటనలు సాగాయని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తనను రాజకీయంగా అణగదొక్కాలని కేసిఆర్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసార‌ని, కాని ఆ ప్ర‌య‌త్నాలు సఫలీకృతం కాలేదని రేవంత్ అన్నారు. అంతేకాకుండా కుట్ర పూరితంగా కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు బ‌నాయిన్నారని అన్నారు.

kcr and police responsible if anything happened to him or his family.. revanth warned..!

మ‌రో రెండు మూడు రోజుల్లో రేవంత్ కు కీల‌క ప‌ద‌వి..!!
మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం నుండి తనకు కీలక పదవి రాబోతుందన్న విషయం తెలుసుకుని, ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రమంతా చేస్తానన్న భయంతోనే నాపై హైకోర్టు కొట్టేసిన కేసును మళ్ళీ తిరగదోడి అక్రమంగా జైలుకు పంపాలని కేసిఆర్ కుట్రచేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ న్యాయరహిత చ‌ర్య‌ల‌కు డిజిపి మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ డిజి ప్రభాకర్ రావు స‌మ‌క‌రిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు. తనకు గాని, తన కుటుంబసభ్యులకు గాని ఎలాంటి హాని జరిగినా దానికి పూర్తి భాద్యత కేసిఆర్, డిజిపి మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ డిజి ప్రభాకర్ రావు లదే అని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

English summary
congress party leader revanth reddy once again fired on trs government. revanth reddy warned the government if there is any harm happened to him or his family government and police department has to take responsibility. kcr ruling as dictator in telangana he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X