వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్గొండ ఉపఎన్నిక కోసం కేసీఆర్ పక్కా ప్లాన్: బిజెపికి షాకిచ్చేందుకు రేవంత్‌రెడ్డి సై

నల్గొండకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

నల్గొండ: నల్గొండకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి రిజైన్, అభ్యర్థిపై త్వరలో నిర్ణయం కూడా తీసుకుంటారని అంటున్నారు.

నల్గొండకు ఉప ఎన్నిక వస్తే.. రేవంత్ రెడ్డి పోటీ, నేతల ఒత్తిడి? ఇదీ ప్లాన్నల్గొండకు ఉప ఎన్నిక వస్తే.. రేవంత్ రెడ్డి పోటీ, నేతల ఒత్తిడి? ఇదీ ప్లాన్

 పక్కా ప్లాన్‌తో ముందుకు

పక్కా ప్లాన్‌తో ముందుకు

నల్గొండ లోకసభకు ఉప ఎన్నికలకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని చాలామంది భావిస్తున్నారు. ఈ నెల (అక్టోబర్) చివరి నాటికి ఈ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను గుర్తించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నారని సమాచారం.

 రూట్ మ్యాప్ సిద్ధమయిందా?

రూట్ మ్యాప్ సిద్ధమయిందా?

సమస్యల గుర్తింపు, పరిష్కారం, గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా, అభ్యర్థి ఎంపిక.. ఇలా ఈ అంశాలపై కేసీఆర్ వద్ద పక్కా ప్రణాళికతో ఉన్నారని సమాచారం. ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. లోకల్ లీడర్లతో చర్చించిన అనంతరం సరైన బలమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారని చెబుతున్నారు.

 కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి

కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి

అంతేకాదు, త్వరలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు, మండలాల వారీగా ఇంచార్జులను నిర్ణయించనున్నారని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకొని తెరాస ముందుకు వెళ్లనుంది.

హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి పర్యటన

హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి పర్యటన

మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిలు నల్గొండ లోకసభ నియోజకవర్గంలో రేపు పర్యటించనున్నారు. వారి పర్యటన కూడా కేసీఆర్ ఉప ఎన్నికలకు సమాయత్తమవుతున్నారని చెప్పడానికి నిదర్శనం అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే మంత్రుల పర్యటన తర్వాత ఎన్నికల వేడి కనిపించవచ్చునంటున్నారు.

 రేవంత్ రెడ్డి కూడా సిద్ధం

రేవంత్ రెడ్డి కూడా సిద్ధం

మరోవైపు, నల్గొండ లోకసభకు ఉప ఎన్నిక వస్తే తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని రేవంత్ ప్రకటించారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

 చంద్రబాబుకు నల్గొండ ఛాన్స్

చంద్రబాబుకు నల్గొండ ఛాన్స్

నల్గొండ ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో బలం పెంచుకోవాలని చూస్తున్న బిజెపి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి. టి టిడిపితో కలిసి వెళ్లేందుకు బిజెపి సిద్ధంగా లేదు. దీనిని అదనుగా తీసుకొని టిడిపి కూడా రేవంత్ రెడ్డిని బరిలోకి దింపుతుందా అనే చర్చ సాగుతోంది. తద్వారా తెలంగాణలోను బిజెపికి తమ సత్తా చూపించవచ్చునని టిడిపి భావిస్తోంది. అక్కడ రెడ్డి సామాజిక వర్గం హవా ఉంటుంది.

ఉవ్వీళ్లూరుతున్న టిడిపి

ఉవ్వీళ్లూరుతున్న టిడిపి

ఇప్పటికే ఏపీలో నంద్యాల, కాకినాడ ఎన్నికల ద్వారా టిడిపి సత్తా ఏమిటో బిజెపికి తెలిసిందని అంటున్నారు. తెలంగాణలో టిడిపి పని అయిపోయిందని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండలో అవకాశం వస్తే బిజెపి కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడం ద్వారా తెలంగాణలోను తమ బలం తగ్గలేదని అటు బిజెపికి, ఇటు అధికార టిఆర్ఎస్‌కు చూపించాలని రేవంత్ రెడ్డి, ఇతర టిడిపి నేతలు ఉవ్వీళ్లూరుతున్నారు.

కోదండరాం కోసం ప్రయత్నాలు

కోదండరాం కోసం ప్రయత్నాలు

ఇదిలా ఉండగా, టిఆర్ఎస్‌కు పోటీగా విపక్షాలు కలిసి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను నిలబెట్టినా మద్దతిచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. లేదంటే మాత్రం తామూ పోటీ చేసి సత్తా చూపించాలని టిడిపి భావిస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆశలు పెట్టుకున్నారు.

English summary
It is said that Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao ready with road map for Nalgonda bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X