వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

(పిక్చర్స్) గాబరాపడని కెసిఆర్, యాగంలో బాబు: ప్రాయుత చండీయాగమంటే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహించిన ఆయుత చండీయాగం ఆదివారంతో ముగిసింది. తన కోరికలు నెరవేరితే ప్రాయుత చండీయాగం చేస్తానని చెప్పారు. తెలంగాణ వచ్చినందునే ఈ యాగం చేశానన్నారు.

చివరి రోజైన ఆదివారం నాడు స్వల్ప అగ్ని ప్రమాదం జరగడంపై స్పందిస్తూ... అపశృతి జరిగినా నేను ఏమాత్రం గాబరాపడలేదన్నారు. యాగశాలలో చిన్న మంట లేవడం చండీమాత అనుగ్రహమేనని చెప్పారు. ఆ మంటతో వైదికంగా పూర్ణాహుతి జరిగిందన్నారు.

చివరి రోజు ఆయుత చండీయాగానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాస్ రావు తదితరులు హాజరయ్యారు.

ప్రాయుత చండీయాగం అంటే...

కెసిఆర్ ఆయుత చండీయాగం అద్భతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో తన కోరికలు నెరవేరితే ప్రాయుత చండీయాగం నిర్వహిస్తానన్నారు. కేసీఆర్ ప్రస్తావనతో అందరి దృష్టి ఈ మహాయాగం పైకి మళ్లింది.

ఈ యాగ సమాచారం కొంత యజుర్వేద సంహితలో ఉంది. అయుత అంటే పదివేలు. ఆ సంఖ్యను పూరిస్తూ.. చండీ సప్తశతి పారాయణాలు చేసి, ఆ సంఖ్యలోని దశాంశంతో అంటే వేయిసార్లు హోమం చేసి, పూర్ణాహుతులను సమర్పిస్తే అది అయుత చండీ మహాయాగం.

భారతీయ సంఖ్యా శాస్త్రవేత్తలు నిర్దేశించిన సంఖ్యామానం ప్రకారం ప్రాయుత అంటే పది లక్షలు. యజుర్వేద సంహితలో ఏక (1), దశ (10), శత (100), సహస్ర (1000), అయుత (10,000), నియుత (1,00,000), ప్రయుత (10,00,000), అర్బుద (10,000,000), మయర్బుద (100,000,000), పరర్ధ (1,000,000, 000), అంత (1,000,000,000,000) లాంటి అతిపెద్ద అంకెల ప్రస్తావన ఉంది.

ఈ లెక్కన ప్రాయుత చండీ మహాయాగం అంటే 10 లక్షల సప్త శతి పారాయణాలు పూరించి దీనికి పదో వంతు అంటే లక్ష హోమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయుత చండీయాగమంటేనే అత్యంత వ్యయప్రయాసలు, కఠోర నియమాలతో కూడుకున్నది. అలాంటిది ప్రాయుత చండీ మహాయాగమంటే దానికి వందరెట్లు అధికం.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహించిన ఆయుత చండీయాగం ఆదివారంతో ముగిసింది.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

లోకకళ్యాణం కోసం సీఎం కెసిఆర్ నియమనిష్ఠలతో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అయుత చండీమహాయాగం సుసంపన్నమైంది.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఆదివారం వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ మహాక్రతువు సంపూర్ణమైంది.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

యాగం ముగింపు సమయంలో వేలమంది రుత్విజుల ఏకకంఠ మంత్రపఠనం, చతుర్వేద స్వాహాకారాలతో యాగశాల పులకించింది. హోమగుండంలో అగ్నికి నానారకాలైన హోమద్రవ్యాలను అర్పించారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

యాగముగింపు అంకానికి విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆదివారం యథావిధిగా ఉదయమే గురుప్రార్థన, పూర్వాంగం, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, కుండసంస్కారం నిర్వహించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

అనంతరం పూర్ణాహుతికి ఆరంభంగా ప్రధాన హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠ జరిగింది. ప్రధాన హోమగుండంలోని అగ్ని ద్వారా 101 హోమగుండాల్లోనూ అగ్నివిహరణం అనే ప్రక్రియ ద్వారా అగ్నిప్రతిష్ఠ జరిగింది.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

మహారుద్ర యాగశాలలు, చతుర్వేద యాగశాలలు, రాజశ్యామల యాగశాలలో పూర్ణాహుతిని కూడా పూర్తిచేశారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

అభిషేక జలాలతో కేసీఆర్ దంపతులతో అవభృథ స్నానం చేయించారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతి జరిగింది. సాయంత్రానికి మొత్తం యాగకార్యక్రమాలు సంపన్నమయ్యాయి.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

యాగంలో ఆఖరిరోజయిన ఆదివారం కూడా భక్తజనం భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగా, మరో మూడురోజులపాటు యాగశాల సందర్శనకు భక్తులను అనుమతిస్తారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

యాగనియమాల మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి యాగస్థలిలోనే నిద్ర చేశారు. సోమవారం కుటుంబసమేతంగా ఆయన వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వరీ దేవిని దర్సించుకున్నారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఆదివారం ఉదయం యాగ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన వెంట కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాస రావు ఉన్నారు. యాగశాల వద్ద వారికి పూర్ణకుంభంతో స్వాగతం లభించింది.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

చంద్రబాబు యాగదీక్షా వస్ర్తాలు ధరించగా సీఎం కేసీఆర్ స్వయంగా యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేయించారు. విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి తీసుకొచ్చిన పూజాద్రవ్యాలను ఏపీ సీఎం చంద్రబాబు సీఎం కేసీఆర్‌కు అందించారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

అతిథులకు సీఎం కేసీఆర్ శివపార్వతుల విగ్రహం వద్ద శాలువాలు కప్పి సత్కరించారు. చంద్రబాబుకు చండీమాత విగ్రహాన్ని బహూకరించారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఆదివారం యాగశాలకు వచ్చిన వారిలో రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు, స్పీకర్ మధుసూదనా చారి, రిటైర్డ్ జడ్జి ఎల్ నర్సింహా రెడ్డి, సినీప్రముఖులు జమున, తనికెళ్ల భరణి, డీ సురేశ్ బాబు ఉన్నారు. యాగం నిర్వహణ కోసం వార్త దినపత్రిక సీఎండీ గిరీశ్ సంఘీ, జేఎంజే గ్రూపు ఛైర్మన్ జేఎం జోషి రూ.25 లక్షల విరాళం అందించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

అంతిమ పూర్ణాహుతి కార్యక్రమం రాష్ట్రపతి రాకకోసం కొద్దిసేపు ఆగింది. ఆ విరామ సమయంలో రుత్విజులంతా యాగశాల నుంచి బయటికి వచ్చి నిలబడ్డారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఈ లోపు మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో యాగశాల ఆగ్నేయం వైపు హోమకుండంలో నిప్పురవ్వలు ఎగిసి స్పల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

అగ్నిమాపకదళం సహా అందరూ అప్రమత్తమై నిమిషాల వ్యవధిలో మంటలను ఆర్పివేశారు. ఆ వెంటనే శాస్ర్తోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి, మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆరంభించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

లోక కల్యాణార్థమే అయుత చండీయాగాన్ని నిర్వహించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే ప్రయుత చండీయాగం కూడా చేస్తామని ప్రకటించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా బతకగలిగితే అదే తనకు తృప్తి అని ముఖ్యమంత్రి చెప్పారు. ఐదు రోజులుగా మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అయుత చండీ మహాయాగం ఆదివారం ముగిసిన సందర్భంగా యాగంలో పాలుపంచుకున్న వారిని కేసీఆర్‌ సన్మానించారు.


ఆయుత చండీయాగం

తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా బతకగలిగితే అదే తనకు తృప్తి అని ముఖ్యమంత్రి చెప్పారు. ఐదు రోజులుగా మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అయుత చండీ మహాయాగం ఆదివారం ముగిసిన సందర్భంగా యాగంలో పాలుపంచుకున్న వారిని కేసీఆర్‌ సన్మానించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ యాగం ఏ ఒక్కరి శ్రేయస్సు కోసమో చేసింది కాదని లోకకల్యాణం, విశ్వశాంతి, విశేషించి వంద సంవత్సరాలు భంగపడి, ఇటీవలే విముక్తమై ప్రగతివైపు అడుగులు వేస్తున్న తెలంగాణ సంక్షేమాన్ని కాంక్షించి నిర్వహించామన్నారు. అమ్మ దయ చూపిందని, మనందరం కూడా తన సేవలో తరించే భాగ్యం కల్పించింద్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

సామూహికంగా జరగాల్సిన పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేశామని, చాలా సంతోషంగా ఉందని కెసిఆర్ అన్నారు. యాగాలు నాకు కొత్త కాదన్నారు. 25 ఏళ్లుగా చేస్తున్నానని చెప్పారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

దైవజ్ఞులు చెప్పిన తర్వాత, నాకు జ్ఞానోదయమయ్యాక, యాగఫలం ఎలా అందుతుందో తెలిశాక వీటిని నిర్వహిస్తున్నామని, కొందరు అపహాస్యం చేశారని, మరికొందరు అవాకులు, చవాకులు మాట్లాడారని, నేను పట్టించుకోలేదన్నారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

జగద్గురువులు భారతీతీర్థ స్వామికి, తొమ్మిది రాష్ట్రాల నుంచి విచ్చేసిన రుత్విజులు, జగద్గురు ఆదేశానుసారం ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఈ ఐదు రోజులూ యాగాన్ని సుసంపన్నం చేసిన వారికి ఇలా ప్రతి ఒక్కరి పాదపద్మాలకు నమస్కరిస్తున్నానని కేసీఆర్‌ చెప్పారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఈ సందర్భంగా మొత్తం 23 మందికి సీఎం కేసీఆర్‌ బంగారు కంకణం తొడిగి శాలువాలతో సత్కరించారు. పండ్లు అందజేశారు. అనంతరం దర్శనం మాసపత్రిక ప్రచురించిన అయుత చండీయజ్ఞ వైభవంగను ఆవిష్కరించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఈ సందర్భంగా సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ.. రాముడు అశ్వమేధ యాగం, ధర్మరాజు రాజసూయ యాగం, ఇప్పుడు ఆ స్థాయిలో కేసీఆర్‌ అయుత చండీమహాయాగం నిర్వహించారన్నారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

యాగం సంపూర్ణమైందని, శాస్త్రోక్తంగా జరిగిందని చెప్పారు. బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

అనంతరం నాగఫణి శర్మ కేసీఆర్‌కు బంగారు కంకణం తొడిగారు. పండితులు, పెద్దలు మంత్రాలు చదువుతూ కేసీఆర్‌ కుటుంబాన్ని ఆశీర్వదించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి దంపతులతో పాటు మరికొందరు సీఎం దంపతులకు నూతన వస్త్రాలు అందించారు.

English summary
Telangna CM KCR's Ayutha Chandi Yagam comleted on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X