వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగ్రత్త! కేసీఆర్ వెనక మోడీ, షా: ‘ఫెడరల్’ పార్టీలకు దాసోజు హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ప్రకటన చేసిన అనంతరం ఓయూకు వెళ్లలేని కేసీఆర్.. దేశమొత్తం తిరుగుతారట అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా, శ్రవణ్ దాసోజు స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

మోడీ, షా డైరెక్షన్‌లో కేసీఆర్

మోడీ, షా డైరెక్షన్‌లో కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా డైరెక్షన్‌లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఫెడరల్‌ ఫ్రంట్‌ నాటకానికి తెరలేపారని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. తన అసమర్థ, అవినీతి, నియంత పాలనతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి.. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రజలను భ్రాంతికి గురి చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఫెడరల్ పార్టీలకు లేఖలు

ఈ మేరకు శుక్రవారం దాసోజు పలువురు జాతీయ స్థాయి నేతలకు లేఖలు రాశారు. ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ మోసం చేస్తున్నారంటూ తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, జేడీఎస్‌ అధ్యక్షుడు దేవెగౌడ, డీఎంకే నేత స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌లకు వేర్వేరుగా లేఖలు పంపారు.

మోడీని గద్దెనెక్కించేందుకే..

మోడీని గద్దెనెక్కించేందుకే..

బీజేపీ వ్యతిరేక వర్గాలను వంచించి, విభజించి తద్వారా కాంగ్రెస్‌కు నష్టం కలిగించడం ద్వారా మోడీని తిరిగి గద్దెనెక్కించేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకముందే బీజేపీ అభ్యర్థులకు కేసీఆర్‌ మద్దతు తెలిపారని అన్నారు. అంతేగాక,, నోట్లరద్దును స్వాగతించారని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే అది చర్చకు రాకుండా పార్లమెంట్‌ను అడ్డుకున్నారని చెప్పారు.

దాసోజు హెచ్చరిక

దాసోజు హెచ్చరిక

జాతీయ స్థాయిలో యూపీఏని, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగంగానే కేసీఆర్ కొత్త ఫ్రంట్ ప్రకటించారని, జాతీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
పార్టీ ఫిరాయింపులు, అవినీతితో కేసీఆర్‌ అణచివేత పాలన సాగిస్తున్నారని, అటువంటి కేసీఆర్‌ మాటలను విశ్వసించి ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతిస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని దాసోజు శ్రవణ్ ఇతర పార్టీల నేతలను హెచ్చరించారు.

English summary
Amid efforts by Telangana Chief Minister K Chandrasekhar Rao (KCR) to form a non-Congress, non-BJP federal front ahead of the 2019 Lok Sabha elections, a Congress leader from the state has written to various political leaders alleging that the TRS supremo's move is a part of a conspiracy hatched by the BJP leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X