వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ది ఫ్యామిలీ ఫ్రంట్, మోసకారి బాబు: తెలుగు సీఎంలను ఏకేసిన బీజేపీ నేతలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ తదుపరి లక్ష్యం తెలంగాణే అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. దక్షిణ భారతంలో 'కాంగ్రెస్‌ ముక్త్‌' బీజేపీ వల్లే సాధ్యమని, తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, టీడీపీలతో ఏదీ కాదని విమర్శించారు.

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తికాలం కొనసాగలేదన్నారు. బీజేపీ కీలక బాధ్యతలు తీసుకోవడమో లేదంటే మధ్యంతర ఎన్నికలు రావడమో జరుగుతుందన్నారు.

బాబుది మోసపూరిత చరిత్ర

బాబుది మోసపూరిత చరిత్ర

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లి పోటాపోటీ ప్రచారాలు చేసినా బీజేపీ, మోడీ పాలనపై కర్ణాటక తెలుగు ప్రజలకు ఆకర్షణ పెరిగిందే కానీ తగ్గలేదన్నారు. కాంగ్రెస్‌కు రుణపడి ఉంటానన్న నాయకుడు (కుమారస్వామి)కి శాలువాలు కప్పిన నేతలు ఆ పార్టీకి అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని ప్రశ్నించారు. ఎన్ని దశలు మారినా చంద్రబాబు మోస చరిత్ర మారదని విమర్శించారు.

Recommended Video

చంద్రబాబు ఫ్రెండ్, మరిన్ని అధికారాలు కావాలి: కేసీఆర్‌
కేసీఆర్‌ది ఫ్యామిలీ ఫ్రంట్

కేసీఆర్‌ది ఫ్యామిలీ ఫ్రంట్

తెలంగాణ, ఆంధ్రలో ప్రజలకనుగుణంగా పాలన నడిపించే శక్తి బీజేపీకి, మోడీకి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. థర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని...అయితే, ఆయనది ఫ్యామిలీ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు.

 కేసీఆర్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు

కేసీఆర్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు


2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. గత నాలుగేళ్ల కాలంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్... కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారని మండిపడ్డారు.
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఈ నాలుగేళ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

 2019కి సిద్ధం కావాలి

2019కి సిద్ధం కావాలి


టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ రాజకీయాల్లో బిజీగా ఉన్నాయని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమరశంఖం పూరిస్తూ 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

భూస్వామి బంధుగా..

భూస్వామి బంధుగా..

మజ్లిస్‌కు కొమ్ముకాస్తూ రూ.40కోట్ల నిధులు కేటాయించిన టీఆర్ఎస్ మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. రైతుబంధు పథకం ‘భూస్వామి బంధు'గా మారిపోయిందన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలను సవాల్‌గా తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, సినీ నటి రేష్మా రాథోడ్, తదితర నేతలు, అన్ని జిల్లాల కార్యకర్తలు పాల్గొన్నారు.

English summary
Telangana state BJP president K. Laxman on Monday claimed that the front proposed by Chief Minister K. Chandrasekhar Rao was a ‘family front’. He said that Mr Rao had failed in fulfilling the promises he had made in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X