వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ-కాంగ్రెస్‌కు ఊహించని షాక్: కేసీఆర్ సంచలనం, ముంబై.. కోల్‌కతా.. దేశవ్యాప్త పర్యటన!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Third Front : KCR to hold National Meetings

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మార్పు రావాలని చెబుతూ థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో అడుగు ముందుకు వేశారు. ఎవరూ ఊహించని నిర్ణయాలు ఆయన తీసుకున్నారు.

జాతీయ రాజకీయాలు మార్చేస్తా, మీ కథలొద్దు, జైలుకు పంపిస్తారా: కేసీఆర్ సంచలనం, మమత ఫోన్జాతీయ రాజకీయాలు మార్చేస్తా, మీ కథలొద్దు, జైలుకు పంపిస్తారా: కేసీఆర్ సంచలనం, మమత ఫోన్

బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన అనూహ్యంగా దేశవ్యాప్తంగా భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు.

 జాతీయస్థాయి సమావేశాలకు కేసీఆర్ అడుగులు

జాతీయస్థాయి సమావేశాలకు కేసీఆర్ అడుగులు

రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ జాతీయస్థాయి సమావేశాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో త్వరలో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. విడతలవారీగా ఆయా ఆధికారులతో సమావేశం కానున్నారు.

అధికారులు, నేతలతో విడతల వారీగా భేటీ

అధికారులు, నేతలతో విడతల వారీగా భేటీ

రిటైర్డ్ అధికారులు, ఆయా రాష్ట్రాల్లోని కీలక నేతలతో విడతలవారీగా సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, యూపీలో మాయావతి, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి వారితో భేటీ కావాలని నిర్ణయించారని తెలుస్తోంది.

 తొలి విడతలో రిటైర్డ్ అధికారులు

తొలి విడతలో రిటైర్డ్ అధికారులు

తొలి విడతలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్‌లతో భేటీ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉండే అధికారులతో ఆయన భేటీ కానున్నారని, వారి నుంచి సమాచారం సేకరించనున్నారని తెలుస్తోంది.

రెండో విడతలో వీరితో

రెండో విడతలో వీరితో

రెండో విడతలో రిటైర్డ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, న్యాయ నిపుణులతో సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల రైతులు, రైతు సంఘాలతో సమావేశం కానున్నారు.

 ఆర్థిక నిపుణులు, మీడియాతో

ఆర్థిక నిపుణులు, మీడియాతో

ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ఆర్థిక నిపుణులు, కార్యదర్శులతో భేటీ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ తర్వాత మీడియా అధినేతలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక నేత సంఘాలతో భేటీ కానున్నారు.

 సంచలన నిర్ణయం

సంచలన నిర్ణయం

కేసీఆర్ గత రెండు మూడు రోజులుగా థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్‍‌లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఇప్పటికే మమతా బెనర్జీ, సోరెన్, మహారాష్ట్ర ఎంపీలు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఎప్పటి నుంచి ప్రారంభిస్తారంటే

ఎప్పటి నుంచి ప్రారంభిస్తారంటే

రాజకీయాల్లో మార్పు కోసం ఆంటూ కేసీఆర్ జాతీయస్థాయి సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా నగరాల్లో ఎప్పుడు ఉంటాయి, ఇవి ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయం త్వరలో తేలనుంది.

English summary
In a country where politicians are wishy-washy about their ambitions, K Chandrashekar Rao has come clean on what he has in mind. He announced that he wishes to lead a non-BJP, non Congress Front at the Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X