• search
 • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటే

|
  ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్...!! | Oneindia Telugu

  టిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలకు ముగ్గురికి షాక్ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జోరుగా జరుగుతోంది.

  ముగ్గురికి షాక్ ఇవ్వనున్న గులాబీ బాస్

  ముగ్గురికి షాక్ ఇవ్వనున్న గులాబీ బాస్

  నేడు టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్దులను ప్రకటించనుంది . సిట్టింగ్ ఎంపీలు సీతారాం నాయక్‌, జితేందర్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలకు టికెట్లు ఇవ్వడానికి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిరాకరించింది.అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వీరు సహకరించలేదని పెద్దఎత్తున ఫిర్యాదులు రావడమే ఇందుకు కారణం. పార్టీ అధిష్ఠానం జరిపిన క్షేత్రస్థాయి సర్వేలోనూ ఇదే విషయం తేలినట్లు తెలిసింది.దాంతో, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం స్థానా ల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది.

  మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ కు చెక్

  మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ కు చెక్

  మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ విషయానికి వస్తే, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతోనూ ఆయన సఖ్యంగా ఉండరని, ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యేలకు ఆయన సహకరించలేదన్న టాక్ ఉంది. అంతేకాదు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు కూడా చేసినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు సీఎం కెసిఆర్ టికెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది .మహబూబాబాద్‌ పరిధిలో పార్టీ పరిస్థితిపై ఆయన సమీక్షించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు కోరెం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ స్థానానికి ఎన్నికల ఇన్‌చార్జిగా సత్యవతి రాథోడ్‌ను సీఎం నియమించారు.

   మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కి టికెట్ కష్టమే

  మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కి టికెట్ కష్టమే

  మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి సైతం టికెట్ కష్టమే అంటున్నాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ పార్టీతో గతంలో టచ్ లో ఉన్నట్టు, పార్టీ మారే ఆలోచన చేసినట్టు జితేందర్ రెడ్డి పై ఆరోపణలున్నాయి. అలాగే జితేందర్ రెడ్డి పై మహబూబ్ నగర్ స్థానిక నాయకత్వం సైతం ఆగ్రహంతో ఉంది. పార్టీ కోసం జితేందర్ రెడ్డి ఏ విధంగా పని చేయలేదని, ఎన్నికల సమయంలో కూడా ఇబ్బందులకు గురి చేశాడని , జితేందర్ రెడ్డి ఎంపిగా నిలబడితే గెలిచే అవకాశం లేదని పార్టీ శ్రేణులు చెప్పడం తో కేసీఆర్ జితేందర్ రెడ్డి టికెట్ ను నిరాకరించినట్లు తెలుస్తోంది.

  16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వ‌స్త‌ది..! శంషాబాద్ స‌భ‌లో కేటీఆర్.!!

  ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి ఔట్

  ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి ఔట్

  ఇక ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టిఆర్ఎస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల పరాజయానికి కారణమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఎంపీగా టికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం లో ఘోర ఓటమి చవి చూసిందని భావిస్తున్న గులాబీ బాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వడానికి నో చెప్పేశారు. అక్కడ నుండి తాజాగా టిఆర్ఎస్ పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావు ని ఎన్నికల బరిలో నిలిపనున్నట్లుగా తెలుస్తుంది.

  పార్టీలో జోరుగా చర్చ

  పార్టీలో జోరుగా చర్చ

  మొత్తానికి ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు గులాబీ బాస్ షాక్ ఇవ్వనున్నారు. వీరికి టికెట్ నిరాకరించడానికి కూడా కెసిఆర్ కు కారణాలున్నాయి. ఇక, తర్జనభర్జనల అనంతరం పెద్దపల్లి స్థానాన్ని ప్రభుత్వ సలహాదారు జి.వివేక్‌కు ఖరారు చేసింది. కరీంనగర్‌ నుంచి సిటింగ్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ ఒక్క పేరునే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In the Lok Sabha elections TRS will be tied with a 16-seat Target. If these 16 seats are taken, KTR will be the boss in TRS party. That is why Ktr also thinks that the 2019 Lok Sabha polls are very prestigious. Since the party announced him as the working president of the party. He decided that he have to show his strength in lok sabha polls and that willbe impact on his leadership in the party .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more