వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఇన్నింగ్స్ ముగింపు: 2021లో ముఖ్యమంత్రిగా కేటీఆర్ -బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ దూకుడు

|
Google Oneindia TeluguNews

గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాలు, ఆ మధ్య దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భారీ విజయం సాధించడంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం దాదాపుగా మారిపోయింది. గడిచిన ఆరేళ్ల పాలనలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆగంపట్టించిన సీఎం కేసీఆర్.. బీజేపీని నిలువరించడంలో మాత్రం దారుణంగా ఫెయిలయ్యారు. పైకి డాంబికం ప్రదర్శిస్తున్నా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 'బీజేపీ ప్రభావం' ముఖ్యమంత్రిని తీవ్రంగా ఆలోచింపజేస్తున్నదని, భవిష్యత్ అవసరాల రీత్యా ప్రస్తుత గులాబీ సేనాని కేటీఆర్‌ను ప్రభుత్వాధినేతగానూ నియమించబోతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేతలు చెబుతున్నారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామజగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

2021లో సీఎంగా కేటీఆర్

2021లో సీఎంగా కేటీఆర్

గత సార్వత్రిక ఎన్నికల్లోనూ మోదీ వేవ్ ను పసిగట్టిన కేసీఆర్.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. 2018 డిసెంబర్ నాటి ఫలితాలతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగా, అదే నెలలో తనయుడు కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు కట్టబెట్టారు. కేటీఆర్ సారధ్యంలోనే 2019 లోక్ సభ ఎన్నికలు, 2020 దుబ్బాక బైపోల్, జీహెచ్ఎంసీ 2020 ఎన్నికలను టీఆర్ఎస్ ఎదుర్కొంది. కానీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని, ప్రగతి భవన్ లో కేటీఆర్ మాట అంతగా చెల్లుబాటు కాలేదని ఆ మధ్య పుకార్లు గుప్పుమన్నాయి. వీటిపై కేటీఆర్ స్పందిస్తూ ‘కేసీఆరే మా దళపతి, ఆయన డైరెక్షన్ లోనే అన్నీ'అని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి డైరెక్షన్ బాధ్యతలను కేటీఆర్ కు కట్టబెట్టబోతున్నారని, కొత్త ఏడాదిలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ చెప్పారు.

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్

కేటీఆర్‌తో భేటీ తర్వాత కామెంట్లు

కేటీఆర్‌తో భేటీ తర్వాత కామెంట్లు


తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యా నాయక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ను ఇటీవలే కలిశానని గుర్తు చేస్తూ మరీ నాయక్ ఈ కామెంట్లు చేశారు. బాధ్యతగా పని చేస్తేనే తప్పక గుర్తింపు లభిస్తుందన్న రెడ్యా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. నిజానికి..

కేసీఆర్ కొత్త ఇన్నింగ్స్..

కేసీఆర్ కొత్త ఇన్నింగ్స్..


జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా కీలక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా టీఆర్ఎస్ పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటుకానుండటంతో దానినే వేదికగా మలుచుకుని కేసీఆర్ కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి, ఫెడరల్ ఫ్రంట్ గా బలపర్చాలన్న లక్ష్యం దిశగా సాగిపోయేందుకు వీలుగా.. కేసీఆర్ తెలంగాణలో ఇన్నింగ్స్ ముగించి, స్ట్రైకింగ్ బాధ్యతలను కొడుకు కేటీఆర్ కు అప్పగిస్తారని వినికిడి. ఎంతోకాలంగా సాగుతోన్న ఈ ప్రచారం.. కొత్త ఏడాదిలోనే కార్యరూపం దాల్చబోతున్నదని టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతున్నది. మరోవైపు..

బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ..

బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ..

తెలంగాణలో బలపడేందుకుగానూ కాషాయ పార్టీ వెస్ట్ బెంగాల్ స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లు జరుగుతోన్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. బెంగాల్ లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ అక్కడి లెఫ్ట్ పార్టీలను తునాతునకలు చేసిన తర్వాత ఏర్పడిన పొలిటికల్ వ్యాక్యూమ్ లోకి బీజేపీ ప్రవేశించింది. తెలంగాణలోనూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని నేల నాకించడం, హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలనూ గులాబీ దండులో చేర్చుకోవడంతో ప్రశ్నించే అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. బెంగాల్లో ఎలాగైతే ప్రభుత్వాధికారులు, పోలీసులను బీజేపీ టార్గెట్ చేసిందో, ప్రస్తుతం తెలంగాణలోనూ పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య యుద్ధం రెండోదశ ప్రారంభంలో ఉంది. గోవుల తరలింపు వివాదంపై పోలీసులను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అతి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వాటికి పోలీసులూ కౌంటరివ్వడం తెలిసిందే. రాబోయేరోజుల్లో మరిన్ని అంశాల్లోనూ ఈ తరహా దృశ్యాలు చూడబోతున్నామని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో..

కేసీఆర్ వల్ల కానిది కేటీఆర్ చేస్తారా?

కేసీఆర్ వల్ల కానిది కేటీఆర్ చేస్తారా?


దేశంలో అన్ని మతాలు సమానమే అని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా.. బీజేపీ పక్కాగా, నిక్కచ్చిగా హిందువుల పార్టీనే అని బండి సంజయ్ పలు మార్లు కరాకండిగా చెప్పారు. తానే అతి పెద్ద హిందువునని సీఎం కేసీఆర్ చెప్పుకున్నా, వేల ఏళ్ల తర్వాత తొలి రాతి ఆలయాన్ని(యాదాద్రి) నిర్మించిన ఘనతను సొంతం చేసుకున్నా.. బీజేపీ మార్కు హిందూ రాజకీయాల ముందు గులాబీ అధినేత నిలవలేకపోయారు. పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైన దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ మామూలు విషయమేమీ కాదు. కేసీఆర్ డైరెక్షన్ లోని టీఆర్ఎస్.. బీజేపీని నిలువరించడంలో పూర్తిగా ఫెయిలైన నేపథ్యంలోనే కేటీఆర్ కు బాధ్యతల అప్పగింత ఉండబోతున్నదని తెలుస్తోంది. స్వతహాగా ఆస్తికుడుకాని, పెద్దగా పూజలు గట్రా చేయని కేటీఆర్ కు పక్కా ప్రాక్టికల్ మనిషిగా పేరుంది. కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను సవరించుకుంటే బీజేపీకి అంతగా అవకాశం ఉండబోదనే వాదన నడుమ ఒకవేళ కొత్త ఏడాదిలో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే గనుక కేసీఆర్ వల్లకాని బీజేపీ కట్టడిని కేటీఆర్ చేసి చూపిస్తాడేమో వేచిచూడాలి.

English summary
ruling trs senior mla redya naik of dornakal said that kcr's son ktr will be telangana's new chief minister before march 2021. amid bjp raising in telangana it is widely debate that kcr would go to national politics and ktr will lead telangana and trs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X