హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీది బోగస్, ఇది నా సర్వే, ఎన్ని సీట్లు వస్తాయంటే: లగడపాటికి కేసీఆర్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

గజ్వెల్: కేసీఆర్ సర్వేను నేను చెబుతున్నానని, వందకు పైగా సీట్లలో మన పార్టీ గెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం చెప్పారు. గజ్వెల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్లుగా చెప్పిన విషయం తెలిసిందే.

వంద సీట్లలో గెలుస్తాం

వంద సీట్లలో గెలుస్తాం

ఈ నేపథ్యంలో కేసీఆర్ గజ్వెల్ సభలో మాట్లాడారు. కేసీఆర్ వంద సీట్లలో గెలుస్తుందని చెప్పారు. తాను గజ్వెల్ నుంచి చాలా ధైర్యంగా చెబుతున్నానని అన్నారు. గజ్వెల్‌లో గెలిస్తే అక్కడ ప్రభుత్వం ఖాయమని చెప్పారు. కాబట్టి ఒక్క ఓటుతో రెండు లాభాలు అని చెప్పారు. గజ్వెల్‌లో తన గెలుపు ఖాయమని, కాబట్టి ప్రభుత్వం ఏర్పడటం కూడా ఖాయమని, రెండూ నిర్ణయం అయ్యాయని చెప్పారు.

 ఆ సర్వేలు నమ్మొద్దు

ఆ సర్వేలు నమ్మొద్దు

తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మనం ఏకపక్షంగా గెలిస్తే గౌరవం ఉంటుందని చెప్పారు. కాబట్టి తనకు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎన్ని బోగస్ సర్వేలు వచ్చినా నమ్మవద్దని లగడపాటి సర్వేను ఉద్దేశించి చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మనలో మనం పరిష్కరించుకుందామని చెప్పారు.

చంద్రబాబు అనేక బాధలు పెట్టారు

చంద్రబాబు అనేక బాధలు పెట్టారు

చంద్రబాబు అనేక బాధలు పెట్టారని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుంటే బతకలేదని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి నాడు చెబితే ఒక్క కాంగ్రెస్ నేత మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబు, రాహుల్ గాంధీలు చేతులు కలిపితే, వారు కలిసి సభలు నిర్వహిస్తే మన దద్దమ్మలు భజన చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు ఎంత ధైర్యం

చంద్రబాబుకు ఎంత ధైర్యం

నిండు సభలో కృష్ణలో నీళ్లు లేవని చంద్రబాబు చెప్పారని, ఆయనకు ఎంత ధైర్యమని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కూటమి గెలిస్తే శనీశ్వరం, తెరాస గెలిస్తే కాళేశ్వరం వస్తుందన్నారు. మైనార్టీల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఇస్తే, తమ ప్రభుత్వం రూ.2వేల కోట్లు మాత్రమే అన్నారు.

English summary
TRS will win 100 seats, says Telangana Care Taker Chief Minister Kalvakuntla Chandrasekhar Rao in Gajwel public meeting. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X